Mega Jathara: టాలీవుడ్‌లో త్వరలో ‘మెగా జాతర’ (Mega Jathara) మొదలు కాబోతోంది. రవితేజ నటించిన సినిమా ‘మాస్ జాతర’ (Mass Jathara) ఈ సంవత్సరం వస్తుండగా.., రాబోయే 2026 సంక్రాంతి నుంచి అసలైన మెగా జాతర మొదలు కానుంది. మెగా ఫ్యామిలీలోని ముగ్గురు అగ్ర హీరోలు- మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan)ల సినిమాలు వరుస నెలల్లో విడుదలకు సిద్ధమవుతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Man Shankara Varaprasad Garu) విడుదలకు దాదాపుగా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వింటేజ్ చిరంజీవిని గుర్తుచేసేలా ఉండే ఈ సినిమా సంక్రాంతి సందడిని మరింతగా అభిమానులకు ఇవ్వనుంది.
Also Read- Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది
చిరు తర్వాత వరసగా పవన్, చరణ్ సినిమాలు
ఆ వెంటనే, ఫిబ్రవరిలో వాలెంటైన్స్‌డే సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) విడుదల ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ కావడం వల్ల భారీ హైప్ ఉంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలైతే మెగా జాతర మరింత రంజుగా మారుతుంది. అయితే, ఈ సినిమా 2026 వేసవిలో విడుదలవుతుందని మరికొన్ని వార్తలు ఉన్నా, ఫిబ్రవరి రిలీజ్‌పై మెగా ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. ఈ రెండు సినిమాల అనంతరం, మార్చి నెలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డేని పురస్కరించుకుని మార్చి 27వ తేదీన రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi) సినిమా విడుదలకానుంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ సినిమాపై గ్లోబల్ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ పుట్టినరోజున విడుదల కావడం అభిమానులకు మరింత ప్రత్యేకమైన ట్రీట్ కానుంది.
Also Read- Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!
మెగా జాతర షురూ..
ఇలా వరుసగా మూడు నెలలు ముగ్గురు మెగా హీరోల సినిమాలు విడుదలకానున్నాయంటే, మెగా జాతర ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత, సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల యేటి గట్టు’ (Sai Dharam Tej Sambarala Yeti Gattu), వరుణ్ తేజ్ ‘VT15’ లేదంటే ‘కొరియన్ కనకరాజు’ (Varun Tej Korean Kanakaraju) వంటి చిత్రాలు 2026 ప్రథమార్థంలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ సినిమాలు కూడా విడుదల అయితే, 2026 ప్రథమార్థంలో మెగా ఫ్యాన్స్‌కి ఈ ట్రీట్ మాములుగా ఉండదనేది స్పష్టమవుతోంది. మొత్తంగా చూస్తే, రాబోయే 2026 మెగా నామ సంవత్సరంగా ఫ్యాన్స్ ఫిక్సయిపోవచ్చు. 2026లో దాదాపు ఆరు సినిమాలు మెగా ఫ్యామిలీ నుంచి రానున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
