Kurnool-Case (Image source Twitter)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Kurnool Bus Accident: యావత్ దేశాన్ని కదిలించిన ‘కర్నూలు బస్సు ప్రమాద’ ఘటనపై (Kurnool Bus Accident) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఏకంగా 20 మంది సజీవదహనమైన ఈ విషాదకర ఘటనకు సంబంధించి ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదానికి కారణమైన రోడ్డు ప్రమాదం చేసిన మృతుడు, బైకర్‌ శివశంకర్‌పై అతడి ఫ్రెండ్ ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు ఉలిందకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ​ శివశంకర్‌పై బీఎన్ఎస్ 183/2025 281, 125(ఏ), 106(ఐ) సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. శివశంకర్‌ నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కారణంగానే డివైడర్‌ను బైక్ ఢీకొట్టిందంటూ ఎర్రిస్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. మరి, చనిపోయిన వ్యక్తిపై కేసు పెట్టారేంటి?, వ్యక్తి లేనప్పుడు విచారణ ఎలా జరుగుతుంది? అనే సందేహాలు కలుగడం సహజం.

నిజానికి, కర్నూలు బస్సు ప్రమాదానికి (Kurnool Bus Accident) కారకుడైన శివశంకర్ మరణించినప్పటికీ, పోలీసులు అతడిపై కేసు నమోదు చేయడం అంత అసాధారణ విషయమేమీ కాదు. విచారణ ప్రారంభ దశలో జరిగే సాధారణ ప్రక్రియే. సాధారణంగా ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ (First Information Report) నమోదు చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్ అనేది కేవలం ఒక ప్రాథమిక సమాచారం మాత్రమే. ప్రమాదానికి కారణమైన వ్యక్తి చనిపోయినప్పటికీ, అతడి చర్యల వల్ల ప్రమాదం జరిగినట్టుగా నిర్ధారణైతే, సదరు వ్యక్తి పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చుతారు. దర్యాప్తు కోసం మృతుడిపై కేసు పెట్టడం అనివార్యం. ఎందుకంటే, మొత్తం ఘటనకు కారణమైన వ్యక్తి, వాహనం, దాని యజమాని, ఇతర బాధ్యతగల వ్యక్తుల పాత్రలను పోలీసులు స్పష్టంగా గుర్తించాల్సి ఉంటుంది.

Read Also- Maoists Surrender: మావోయిస్టులకు మరో భారీ షాక్.. పెద్ద సంఖ్యలో సరెండర్.. ఎక్కడంటే?

మృతుడిపై కేసు కొనసాగుతుందా?

భారతీయ చట్టాల ప్రకారం, నేర విచారణ కేవలం నిందిత వ్యక్తి జీవించి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మరణించిన వ్యక్తిపై విచారణ కొనసాగించడానికి వీలులేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని (CrPC) రూల్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. శిక్ష విధించే అవకాశం లేనందున, కేసు ఉద్దేశ్యం నెరవేరదు. కాబట్టి, మృతుడిపై ఉన్న కేసు ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. దీని ప్రకారం, కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన శివశంకర్‌పై కేసు కూడా రద్దవుతుంది. కోర్టు విచారణ ముందుకు సాగదు. అయితే, ప్రమాదానికి మూల కారణంపై దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. అంటే శివశంకర్ నిర్లక్ష్యం ఉందా?, సాంకేతికపరమైన లోపాలున్నాయా?, లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి అంశాలను స్పష్టంగా తెలుసుకొని రికార్డ్ చేయాల్సి ఉంటుంది.

బాధితులకు పరిహారం అందివ్వడానికి

మృతుడిపై కేసు రద్దు అయినా, ప్రమాదంలో బాధితులు (ప్రమాదంలో చనిపోయిన లేదా గాయపడినవారు) మోటార్ వెహికిల్ యాక్ట్-1988 ప్రకారం ‘క్లెయిమ్ ట్రిబ్యునల్’లో పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే, నిందిత వ్యక్తి చనిపోయినా బాధితుల హక్కులు మాత్రం ప్రభావితం కాబోవు. చట్ట ప్రకారం, సీఆర్‌పీసీ సెక్షన్ 173(8) ప్రకారం, దర్యాప్తు పూర్తయిన తర్వాత పోలీసులు తుది నివేదికలో నిందితుడు మృతి (Accused is deceased) అని రాస్తారు. న్యాయస్థానం ఆ నివేదికను పరిగణనలోకి తీసుకొని కేసును ‘క్లోజుడ్ యాజ్ అబేటెడ్’గా నమోదు చేస్తారు. అంటే, కేసు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడడంతో ముగిసిపోయిందని అధికారికంగా నమోదు చేస్తారు.

Read Also- Montha Cyclone: తెలంగాణకు మొంథా ముప్పు.. ఈ జిల్లాల్లో అతితీవ్ర వర్షాలు.. ఆకస్మిక వరదలు

గతంలోనూ ఇలాంటి కేసులు

గతంలో ఇలాంటి కేసులు చాలానే జరిగాయి. ఒక ఉదాహరణగా చెప్పాలంటే, 2013 మేడ్చల్ బస్సు ప్రమాదం కేసును పరిగణలోకి తీసుకోవచ్చు. ఆ కేసు కూడా ఇదే తరహాలో నడిచింది. డ్రైవర్ ఘటనలో మరణించాడు. అయినప్పటికీ, పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. కానీ, తర్వాత ‘డ్రైవర్ మృతి’ అని సూచిస్తూ కేసును మూసివేశారు. కానీ, బస్సు యజమాని, ట్రావెల్స్ సంస్థపై నిర్లక్ష్యం కేసులను మాత్రం కొనసాగించారు.

కాబట్టి, కర్నూలు ఘటనలో శివశంకర్ మరణించినప్పటికీ, కేసు నమోదు చేయడం చట్టప్రక్రియలో భాగమే. ఘటనకు కారణం ఏమిటో తెలుసుకోవడం, ఇతర బాధ్యులపై చర్యలు తీసుకోవడం, బాధితులకు న్యాయం చేయడం ఈ మూడు లక్ష్యాలుగా దర్యాప్తు కొనసాగుతుంది. మరణించిన వ్యక్తిపై శిక్ష సాధ్యం కాదు. కానీ, దర్యాప్తు ప్రక్రియ మొత్తం న్యాయబద్ధంగా జరగడానికి ఈ రకంగా మృతిపై కూడా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది.

Just In

01

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్