mass-ajatara( image:X)
ఎంటర్‌టైన్మెంట్

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Mass Jathara: మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మాస్ జాతర’ విడుదల కోసం దాదాపుగా ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తుంది. ఈ సారి ఎలాగైనా విడుదల చేయాలని నిర్మాతలు బలంగా ఉన్నారు. కానీ అదికూడా కుదిరినట్లు లేదు. ఎందుకంటే మాస్ జాతర అక్టోబర్ 31న విడుదల చేయాలని అనుకున్నా ఆ రోజు ప్రీమియర్ షోలు మాత్రమే పడతాయని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనికి కారణం ఆరోజున బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కావడమే ఆ సినిమా విడుదల అయితే మాస్ జాతర కలెక్షన్లకు గండి పడుతుంది కాబట్టి మాస్ జాతరను నవంబర్ 1 కి వాయిదా వేశారని సమాచారం. అదే నిజం అయితే సినిమా కోసం ఒక రోజు వెయిట్ చేయాల్సి వస్తుంది ఫ్యాన్స్. ఇప్పటికే సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాల్సిందే.

Read also-Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మించిన ఈ చిత్రం, రవి తేజను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారిగా చూపిస్తుంది. శ్రీలీల హీరోయిన్‌గా సందడి పంచుకుంటూ, నీతిష్ నిర్మల్, రితు పి. సూడ్, హైపర్ ఆది, బ్రహ్మాజీ, మురలి శర్మ వంటి సపోర్టింగ్ క్యాస్ట్‌తో మెరిసే ఈ సినిమా, యాక్షన్, కామెడీ, డ్రామా మిక్స్‌తో పూర్తి మాస్ అప్పీల్‌ను ఇవ్వనుందని నిర్మాతలు తెలిపారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం, రామ్ ప్రసాద్ మెహర్ కెమెరా వర్క్‌తో విజువల్స్ బాంబ్ అవుతాయని మూవీ టీం అంటుంది. ఈ చిత్రం తొలుత మే 9, 2025కి ప్లాన్ చేసినా, పోస్ట్-ప్రొడక్షన్ డిలేల కారణంగా ఆగస్ట్ 27కి మార్చారు. తర్వాత సెప్టెంబర్ 5కి, అక్టోబర్ 31కి వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిల్లర మార్పుతో నవంబర్ 1న ‘మాస్ జాతర’ సెలబ్రేట్ అవుతుంది.

Read also-Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..

రవి తేజా ఫ్యాన్స్‌లో ఈ వాయిదాలు కొంచెం డౌట్ కలిగించినా, ఈ చిత్రం పై హైప్ ఎక్కువే. సోషల్ మీడియాలో “ఒక రోజు వాయిదా, మాస్ డబుల్!” అంటూ మీమ్స్, పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. హైపర్ ఆదితో రవి తేజ కామెడీ క్లిప్‌లు కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ మార్పు ‘బాహుబలి’ రీ-రిలీజ్ హీట్‌తో క్లాష్ నుంచి దూరం చేసుకోవడానికేనని ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చర్చ. ఈ నిర్ణయం రవి తేజ సినిమాకు మరింత స్పేస్ ఇస్తుందని అంచనా. ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 27 తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..