Arjun Erigaisi Wins Stepan Avagyan Memorial 2024 With A Round To Spare Achieves
స్పోర్ట్స్

Grand Master: అదరగొట్టిన అర్జున్

Arjun Erigaisi Wins Stepan Avagyan Memorial 2024 With A Round To Spare Achieves: తెలుగు కుర్రాడు, భారత గ్రాండ్‌ మాస్టర్ అర్జున్ ఎరిగైసి స్టెపాన్ అవగ్యాన్ మెమోరియల్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అర్మేనియాలో జరుగుతున్న చెస్ టోర్నీని మరో రౌండ్ మిగిలి ఉండగానే దక్కించుకున్నాడు. 8వ రౌండ్‌లో వోలోడార్ ముర్జిన్ రష్యాపై నెగ్గడంతో టోర్నీలో అతని విజయం లాంఛనమైంది.

నామమాత్రపు 9వ రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో అర్మేనియా ప్లేయర్ పెట్రోస్యాన్‌తో అర్జున్ పోటీపడ్డాడు. నల్ల పావులతో ఆడిన అతను 43 ఎత్తుల్లో డ్రాకు అంగీకరించాడు. టోర్నీలో అర్జున్ 9 రౌండ్లలో ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. నాలుగు విజయాలు, ఐదు డ్రాలతో 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ ఎగరేసుకపోయాడు. ఈ ప్రదర్శనతో అర్జున్ ఫిడే లైవ్ రేటింగ్స్‌లో 2779.9 పాయింట్లతో 4వ స్థానానికి చేరుకున్నాడు.

అతని కంటే ముందు మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే), హికారు నకమురా (అమెరికా), ఫాబియానో కరువానా (అమెరికా) 2795.6 ఉన్నారు. ఫాబియానో కరువానా కంటే అర్జున్ కేవలం 16 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ఈ ఏడాది అర్జున్‌కు ఇదే రెండో టైటిల్. ఏప్రిల్‌లో అతను మెనోర్కా ఓపెన్ విజేతగా నిలిచాడు.

Just In

01

School Holidays: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు మూడురోజులు సెలవులు

Bigg Boss Telugu Nominations: నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మాజీ కంటెస్టెంట్స్ రీఎంట్రీ.. గూస్ బంప్స్ ప్రోమో భయ్యా!

Highest Paid Actors: రెమ్యునరేషన్లలో వెనక్కి తగ్గేదే లే అంటున్న సౌత్‌ యాక్టర్లు..

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?