BRS Party: జూబ్లీహిల్స్ ప్రచార సరళిపై గులాబీ నిత్యం ఆరా
BRS Party (imagecrdit:twitter)
Political News, హైదరాబాద్

BRS Party: జూబ్లీహిల్స్ ప్రచార సరళిపై గులాబీ నిత్యం ఆరా.. సొంత నేతలపై నిఘా!

BRS Party: జూబ్లీహిల్స్ లో గెలుపుకోసం ఇప్పటికే బీఆర్ఎస్(BRS) పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ఈ తరుణంలో పార్టీ నాయకులు పనిచేస్తున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు సిద్ధమైంది. డివిజన్లలో ఎంతమంది నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.. వారు ఎవరెవరిని కలుస్తున్నారు.. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారా?.. ప్రభుత్వ వైఫల్యాలను ఏమేరకు వివరిస్తున్నారు.. గ్యారెంటీ కార్డులను సైతం ప్రజలకు అందజేసి బీఆర్ఎస్(BRS) వైపునకు ఆకర్షించేలా ఎలాంటి చతురతను అవలంభిస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. సొంతపార్టీ నేతల కదలికలపై పార్టీ అధిష్టానం నిఘా పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నేతలతో సంబంధాలు.. 

ప్రతి నాయకుడు ఎన్నికల ప్రచారంలో ఏం చేస్తున్నారు.. ఏయే కాలనీలో ఎవరెవరిని కలుస్తున్నారు.. ఏ రోజు ఏ కాలనీలో ప్రచారం చేస్తున్నాడనే వివరాలు తమకు తెలుసు అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో శనివారం జూబ్లీహిల్స్ పార్టీ ఇన్ చార్జులు, గ్రేటర్‌ హైదరాబాద్(Hyderabad)‌ పరిధిలోని ఎమ్మెల్యేలు(MLA), ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలోనే వెల్లడించడం చర్చకు దారితీసింది. దీనికి కారణం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav) తో బీఆర్ఎస్ నేతలు దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటం, గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం, నేతలతో సంబంధాలు ఉండటంతో అలర్టు అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గులాబీకి డూర్ ఆర్ డై(DO Ar Die) కావడంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. రాబోయే ఎన్నికలకు ఇది నాంది అని నేతలు ఇప్పటికే బహిరంగంగానే పేర్కొంటున్నారు. జూబ్లీహిల్స్‌ లో పార్టీ గెలిస్తే, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తామని, మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది తొలిమెట్టు అని అభిప్రాయపడుతుంది. దీంతో ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకొని ముందుకు సాగుతుంది.

Also Read:OTT Movie: సముద్ర జలాల్లో సస్పెన్స్ థ్రిల్లర్.. సింగిల్ లేడీ అదరగొట్టింది మామా..

ఎన్నికల్లో నేతల పనితనం.. 

మరోవైపు సొంతపార్టీనేతలపై నిఘా పెట్టడం విస్తృత చర్చజరుగుతుంది. బాధ్యతలు అప్పగించినప్పటికీ ప్రచార సరళిపై ఆరా తీస్తుంది. ఎందుకు ఇలా చేస్తుందనేది కూడా చర్చనీయాంశమైంది. పార్టీకోసం పనిచేస్తున్నామని నేతలు బహిరంగంగా పేర్కొంటున్నప్పటికీ పార్టీ మాత్రం కదలికలను గమనిస్తుంది. ఉప ఎన్నికల్లో నేతల పనితనం బట్టి రాబోయే కాలంలో పదవులు అప్పగించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా 40 మంది, డివిజన్ ఇన్ చార్జులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా నియోజకవర్గ ఓటర్లను కలువాలని, వారికి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని, వారిని ఎలా ఆకట్టుకోవాలనే అంశాలపై మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇంకో వైపు నేతలకు హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నేతలకు కేసీఆర్ సైతం దిశానిర్దేశం చేశారు. పకడ్బందీగా ఎన్నికల వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

Also Read: Surender Reddy: సురేందర్ రెడ్డి బ్రేక్‌కు కారణమేంటి? నెక్ట్స్ సినిమా ఎవరితో?

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క