The Girlfriend: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమాకు రష్మిక మందన్నా రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేసిందని, తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో నిర్మాత రివీల్ చేశారు. ఈ సినిమాను నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ట్రైలర్ విడుదల చేశారు.
Also Read- Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?
రెమ్యూనరేషన్ తీసుకోలేదు
ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. మేము ఏ సినిమా కూడా రొటేషన్ కోసం చేయము. మొదటి నుంచి కథను నమ్మి ప్యాషనేట్‌గా నిర్మిస్తున్నాం. కెరీర్‌లో పది సినిమాలు చేసినా అవి గుర్తుండిపోయేలా ఉండాలని అనుకుంటున్నాం. అలాంటి వాటిలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా మొదటి స్థానంలో ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు ఈ సినిమాను తప్పకుండా నిర్మించాలని అనుకున్నాం. ఈ జర్నీలో డైరెక్టర్ రాహుల్ మంచి మిత్రుడు, సోదరుడిలా మారిపోయారు. రష్మిక ఈ సినిమాను ఒప్పుకోవడమే మా మొదటి సక్సెస్‌గా భావిస్తున్నాం. రెమ్యునరేషన్ గురించి మాట్లాడాలని వెళితే ఆమె మేనేజర్ స్పందించలేదు. ఏంటి ఆమె ఈ సినిమా చేయదా? అని కంగారు పడ్డాం. తర్వాత డైరెక్టర్‌గా ఆమెనే కలిసి రెమ్యూనరేషన్ గురించి మాట్లాడితే.. సినిమా కంప్లీట్ అయ్యాక తీసుకుంటానని అన్నారు. ఇలాంటి సపోర్ట్, ఈ స్థాయిలో ఉన్నవారెవరూ ఇవ్వలేరనిపించింది. రష్మిక లేకుంటే ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమానే లేదు. దీక్షిత్ మాకు దొరికిన మరో గొప్ప నటుడు. ఈ సినిమా తర్వాత మరో పదేళ్లు వరుసగా సినిమాలు చేస్తాడు. అల్లు అరవింద్ సార్ మాకు గాడ్ ఫాదర్ అని చెప్పుకొచ్చారు.
Also Read- Chiranjeevi: పేరు, ఫొటోల విషయంలో చిరంజీవి తీసుకున్న నిర్ణయానికి కారణం బాలయ్యేనా?
ఫస్ట్ ఆడియెన్ నేనే..
చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. నేను స్టూడెంట్‌గా హాస్టల్లో ఉండే రోజుల్లోనే ఈ స్టోరీ ఐడియా వచ్చింది. ఆ ఐడియాని కొన్నేళ్ల క్రితమే స్టోరీగా రాసుకున్నాను. ఇప్పుడు ట్రైలర్‌లో ఏం చూశారో అదే సినిమా. ఇంటెన్స్ ఎమోషన్‌తో ఉంటుంది. రిలేషన్ షిప్ ట్రై చేయాలనుకునే వారు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఈ సినిమా చూసి ఆ ఎమోషన్‌తో బయటకు వస్తారు. మూవీ రియల్‌గా, రూటెడ్‌గా, ఇంటెన్స్‌గా , ఎమోషనల్‌గా ఉంటుంది. హీరో దీక్షిత్, హీరోయిన్ రష్మిక ఈ కథకు లైఫ్ ఇచ్చారు. ఇలాంటి యాక్టర్స్ దొరకడం ఏ దర్శకుడికైనా అదృష్టమనే చెప్పాలి. నేను మానిటర్ వెనకాల కూర్చుని వీళ్ల నటన చూస్తూ ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకు నేనే ఫస్ట్ ఆడియెన్ కావడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
