Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?
Mass Jathara (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Mass Jathara: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara) విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 31న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, విడుదలకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడటంతో.. సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయేలా చేస్తూ వస్తున్నారు మేకర్స్. కానీ అక్కడుంది మాస్ మహారాజా కావడంతో.. ఎన్నిసార్లు వాయిదా పడినా ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తూనే ఉన్నారు.

Also Read- Australia Cricketers: ఆసీస్ మహిళా క్రికెటర్లను వేధించిన నిందితుడి మక్కెలు విరగ్గొట్టిన పోలీసులు.. వీడియో ఇదిగో

సెన్సార్ పూర్తి

నూతన దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను (Mass Jathara Censor Details) పూర్తి చేసుకుని, ‘యుబైఏ’ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా, సినిమా నిడివి (రన్ టైమ్)ని కూడా లాక్ చేశారు. ‘మాస్ జాతర’ మొత్తం నిడివి (Mass Jathara Run Time) 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు) గా లాక్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత ట్రెండ్‌లో సినిమాలు 2 గంటల 30 నిమిషాల లోపు ఉండేందుకే నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో ‘మాస్ జాతర’ నిడివి 160 నిమిషాలు ఉండటం ఆసక్తికరమైన విషయమే. అయితే, రవితేజ సినిమాల్లో ఉండే వినోదం, యాక్షన్, భావోద్వేగాలు ప్రేక్షకులను అలరించగలిగితే, ఈ రన్ టైమ్ పెద్ద సమస్య కాబోదని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాస్, ఫన్, యాక్షన్ అంశాలన్నీ కలగలిపి దర్శకుడు భాను ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ఇది అసలు సిసలైన మాస్ జాతరను థియేటర్లలో తీసుకురాబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇందులో రవితేజ పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు.

Also Read- SKN: 100 కోట్ల క్లబ్‌లోకి ‘డ్యూడ్’.. ప్రదీప్‌‌కు ఆ హీరోల రేంజ్ ఇచ్చిన ఎస్కేఎన్..

అక్టోబర్ 27న ట్రైలర్ విడుదల

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన మేకర్స్, ‘మాస్ జాతర’ థియేట్రికల్ ట్రైలర్‌ను అక్టోబర్ 27వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు రవితేజ అభిమానులకు విపరీతంగా నచ్చడంతో, ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సార్, రన్ టైమ్ వివరాలు బయటకు రావడంతో, అక్టోబర్ 31న బాక్సాఫీస్ వద్ద రవితేజ మాస్ పవర్ ఎలా ఉంటుందో చూడటానికి ప్రేక్షకులు సిద్ధమైపోవచ్చు. ఈసారి ఎటువంటి వాయిదాలు ఇక ఉండవ్..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..