seethakka (image credit: swetcha reporter)
Politics, తెలంగాణ

Seethakka: ఏడాదిన్నరలోనే 80 వేల కొలువులు ఇచ్చాం.. పదేళ్ల నిరీక్షణకు ఇప్పుడు ఫలితం : మంత్రి సీతక్క 

Seethakka: తమ పదవులు కోల్పోయి నిరుద్యోగులుగా మారిన కొందరు రాజకీయ నాయకులు ఇప్పుడు నిరుద్యోగ కార్డులు అంటూ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి సీతక్క (Seethakka) ఫైర్ అయ్యారు. నిరుద్యోగులను నిండా ముంచిన బీఆర్ఎస్ నాయకులను నిరుద్యోగులు నిలదీయాలని పిలుపు నిచ్చారు. రాజేంద్రనగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ఆడిటోరియంలో శనివారం డీపీఓ, ఎంపీడీవో శిక్షణ ముగింపు కార్యక్రమంలోపాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న డీపీఓ, ఎంపీడీవో లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ‘పదేళ్ల నిరీక్షణకు ఇప్పుడు ఫలితం దొరికింది.

80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మీలాంటి ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు కల్పించింది. ఏడాదిన్నర కాలంలోనే 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగాం. మాది ఉద్యోగ నామ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమే ప్రభుత్వ ఉద్యోగాల ప్రభుత్వం’ అని స్పష్టం చేశారు. గ్రామీణ అభివృద్ధిలో ఎంపీడీవోల పాత్ర ఎంతో కీలకమని, మండల స్థాయిలో అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అభివృద్ధి దిశగా నడిపించాల్సిన బాధ్యత ఎంపీడీవోలదేనని వివరించారు.

Also Read: Seethakka: అంగన్‌వాడీ కేంద్రాల్లో లోపాలు సహించం.. మంత్రి సీతక్క హెచ్చరిక!

ప్రతి మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేయాలని, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటనలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా అధికారులు వ్యవహరించాలంటూ ఆమె పిలుపునిచ్చారు. ఉద్యోగ బాధ్యత నెరవేర్చే క్రమంలో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టాలని సూచించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, డైరెక్టర్ సృజన మాట్లాడుతూ.. ఫ్లెక్సిబుల్ మైండ్ తో, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలని కోరారు. రూల్ ఆఫ్ లా, చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతూ విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో టీజీ ఐఆర్డీ సీఈఓ నిఖిల, అధికారులు పాల్గొన్నారు.

మహిళా శిశు సంక్షేమ శాఖలో 181 కొత్త సూపర్వైజర్ల నియామకం.. మంత్రి సీతక్క 

రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్డీ ప్రాంగణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 181 మంది గ్రేడ్ వన్ సూపర్వైజర్లకు మంత్రి సీతక్క నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. అంగన్వాడీ వ్యవస్థ మహిళా శక్తికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. “ఐసీడీఎస్ సేవలకు ఈ దేశంలో ఇందిరా గాంధీ ప్రాణం పోశారని, మహిళలకు గౌరవం, చిన్నారులకు సంరక్షణ కలగాలని ఆమె ప్రారంభించిన అంగన్వాడీ సేవలు తెలంగాణ నేల నుంచే బీజం వేశాయన్నారు. అంగన్వాడీ హెల్పర్‌ నుంచి మహిళా శాఖ సెక్రటరీ వరకు ఈరోజు ఉన్న పదవులన్నీ ఇందిరా గాంధీ చలువే.. ప్రతి మహిళ ఆమెకు రుణపడి ఉండాలన్నారు. సమావేశంలో మహిళా సహకార అభివృద్ధి సంస్ధ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: Seethakka: నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

Just In

01

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

Private Buses: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు.. తెలంగాణలో తొలిరోజే 4 బస్సులు సీజ్