Huzurabad (image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Huzurabad: 12 గంటలు దాటినా తెరవని హుజురాబాద్ ప్రభుత్వ కార్యాలయం.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు

Huzurabad: ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, ఉద్యోగుల సమయపాలనపై తరచూ వినిపిస్తున్న ఫిర్యాదులు నిజమేనని నిరూపిస్తూ, కరీంనగర్ రోడ్డులోని హుజురాబాద్ (Huzurabad) సహాయ కార్మిక అధికారి కార్యాలయం మధ్యాహ్నం 12 గంటలు దాటినా కూడా మూసి ఉంచడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సాధారణంగా పనివేళలు పాటించాల్సిన కార్యాలయం, కీలకమైన  రోజు మధ్యాహ్నం వరకు తెరుచుకోకపోవడంతో కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Also Read: Huzurabad: హుజూరాబాద్‌లో బంద్ విజయవంతం.. ఆర్టీసీ డిపో ముందు ధర్నా ప్రయాణికులకు ఇబ్బందులు

దూర ప్రాంతాల ప్రజల ఆవేదన

పలు కార్మిక సమస్యలు, దరఖాస్తులు, ఇతర అత్యవసర పనుల నిమిత్తం జమ్మికుంట, ఇల్లంతాకుంట, వీణవంక, సైదాపూర్, కేశవపట్నం వంటి పలు మండలాల గ్రామాల నుంచి హుజురాబాద్ పట్టణానికి వచ్చిన సామాన్య ప్రజలు, కార్మికులు కార్యాలయం మూసి ఉండటం చూసి నిరాశ చెందారు. చాలా దూరం నుంచి ప్రయాణ ఖర్చులు, సమయం వెచ్చించి వచ్చిన తమకు అధికారులు అందుబాటులో లేకపోవడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు కనీస సమయపాలన పాటించకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ప్రజా సేవలు అందించే కార్యాలయాలు నిర్ణీత పనివేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే సహాయ కార్మిక అధికారి కార్యాలయం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఉద్యోగులు విధిగా సమయపాలన పాటించాలని, లేనిపక్షంలో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: Huzurabad: సీపీఆర్ అంటే ఏమిటి? ఎలా చేయాలి? అత్యవసర సమయాల్లో ప్రాణదాత!

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?