shiva-movie( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Shiva 4K rerelease: నాగార్జున సినిమాకు అల్లు అర్జున్ ప్రమోషన్స్.. ఈ సారి రెండు లారీలంట.. ఏంటో చూద్దామా..

Shiva 4K rerelease: తెలుగు సినిమా పరిశ్రమలో ‘కల్ట్ క్లాసిక్’గా చిర స్థాయిగా నిలిచిన అక్కినేని నాగార్జున్ నటించిన ‘శివ’ సినిమా, మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1989లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా విద్యార్థి గొడవలు, రాజకీయ గ్యాంగ్‌లు, సామాజిక అంశాలతో బలమైన కథనంతో చూపించి ట్రెండ్‌సెటర్‌గా మారిన ఈ చిత్రం. ఇప్పుడు 4K క్వాలిటీలో డాల్బీ అట్మాస్ సౌండ్‌తో నవంబర్ 14, 2025న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన స్టైల్లో ఈ సినిమా గురించి ప్రమోషన్స్ చేశారు. ఇప్పటికే కల్ట్ క్లాసిక్ గా వచ్చిన ఈ సినిమాకు ఐకాన్ తోడయితే దాని రేంజే మారిపోతుంది. ఇప్పుడు అదే జరిగింది. శివ సినిమాకు అల్లు అర్జున్ ప్రమోషన్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అప్పట్లో ఈ కల్ట్ సినిమా గొప్పతనాన్ని బన్నీ మరో సారి వివరించారు.

Read also-Mass Jathara trailer: ‘మాస్ జాతర’ ట్రైలర్‌ అప్డేట్ ఇచ్చిన రవితేజ.. వచ్చేది ఎప్పుడంటే?

అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన స్పెషల్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ఈ సినిమా గురించి మాట్లాడారు. ‘శివ’ సినిమా తెలుగు సినిమాపై చూపిన ఇంపాక్ట్ గురించి ఆయన తన ఆలోచనలు పంచుకున్నారు. ఈ సినిమా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కెరీర్‌లో మైలురాయిగా నిలిచి, ఇళయరాజా సంగీతంతో మరింత ఆకట్టుకున్నట్టు బన్నీ ప్రశంసించారు. ఈ ఈవెంట్ వీడియో అన్నపూర్ణ స్టూడియోస్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదలై, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగార్జున్ ఈ ప్రమోషన్స్‌కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. నాగ చైతన్య కూడా ఈ ప్రమోషన్ చేసినందుకు ఐకాన్ స్టార్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Read also-The Girlfriend trailer: రష్మిక మందాన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ వచ్చేసింది.. ఏం పర్ఫామెన్స్ గురూ..

‘శివ’ సినిమా టాలీవుడ్ చరిత్రలో ఒక ట్రెండ్‌ సెటర్. 1989 అక్టోబర్ 5న మొదటిసారి విడుదలైన ‘శివ’, విద్యార్థి నాయకుడు శివ (నాగార్జున్) జీవితంలో జరిగే ట్విస్ట్‌లను, గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని చూపించింది. అమల అక్కినేని, అమర్, రఘువరణ్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా హిందీలో ‘శివ (1990)’ పేరుతో రీమేక్ అయి మరో హిట్ సాధించింది. రామ్‌గోపాల్ వర్మ ఈ చిత్రంతో తన దర్శకత్వ ప్రతిభను ప్రపంచానికి చాటుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్స్‌లో ఈ చిత్రం రూపొందింది. 50 ఏళ్ల అన్నపూర్ణ స్టూడియోస్ వైభవాన్ని గుర్తుచేస్తూ, ఈ రీరిలీజ్ జరుగుతోంది. ఈ సినిమాకు ఇళయరాజా స్వరాలు, ఎస్.గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి 4Kలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను 4కే లో చూడటానికి అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Crime News: ఓ యువకుడు గంజాయి సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్..!

Vijayawada Airport Fire: గన్నవరం విమానశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు

CM Revanth Reddy: రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్..!

Harish Rao Father Death: హరీశ్ రావు తండ్రి మరణం.. సీఎం రేవంత్ సంతాపం.. పరామర్శించిన కేసీఆర్

Baby Sale Case: దారుణం.. చెల్లిని అమ్మవద్దు అని తల్లి కాళ్ల మీద పడి వేడుకున్న కూతుర్లు.. ఎక్కడంటే?