Rashmika Mandanna: బస్సు ప్రమాదంపై ఎమోషనల్ అయిన రష్మిక
rashika-mandana( image :X)
ఎంటర్‌టైన్‌మెంట్

Rashmika Mandanna: కర్నూలు బస్సు ప్రమాదంపై ఎమోషనల్ అయిన రష్మిక మందాన..

Rashmika Mandanna: ఆంధ్రప్రదేశ్‌లోని కుర్నూలు జిల్లాలో జరిగిన బస్సు దుర్ఘటన దేశవ్యాప్తంగా ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. తాజాగా ఈ ఈ ఘటనకు సంబంధించి టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందాన విచారం వ్యక్తం చేశారు. రష్మిక మందాన తన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు.. “కుర్నూల్ నుంచి వచ్చిన వార్తలు నా మనసును బరువెక్కించాయి. మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు ఎదుర్కొన్న బాధ ఊహించలేనిది. చిన్న పిల్లలతో కుటుంబాలు క్షణాల్లోనే మరణించడం హృదయవిదారకం.. ఈ ప్రమాదంతో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను” అని రాశారు. పలువురు సినీ ప్రముఖులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

Read also-AI voice in Spirit: ‘స్పిరట్’ గ్లింప్స్‌లో ప్రభాస్ వాయిస్ నిజం కాదని మీకు తెలుసా.. ఏం చేశారంటే?

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు మోటార్‌సైకిల్‌తో ఢీకొని మంటల్లో కాలిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 20 మంది మరణించగా, అందులో చిన్న పిల్లలతో కుటుంబాలు మొత్తం చనిపోయారు. దుర్ఘటన సమయంలో చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉండటంతో, మంటలు వేగంగా వ్యాపించి వారిని బయటపడే అవకాశం లేకుండా చేశాయి.

Read also-Sandeep Raj: బండి సరోజ్‌తో ఉన్న విభేదాల గురించి క్లారిటీ ఇచ్చిన సందీప్ రాజ్..

దుర్ఘటన ఎలా జరిగింది.. శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో కుర్నూల్ జిల్లా చిన్నతెకూరు గ్రామం సమీపంలోని జాతీయ రహదారి 44 (హైదరాబాద్-బెంగళూరు హైవే)లో జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ‘ఓ ట్రావెల్స్’కు చెందిన ఈ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ అధిక వేగంతో వెళ్తుండగా, రోడ్డు మధ్యలో ఉన్న మోటార్‌సైకిల్‌ ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో మోటార్‌సైకిల్ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు. అప్పుడే బస్సు ఇంధన ట్యాంక్ లీక్ అయి మంటలు మొదలయ్యాయి. కొన్ని నిమిషాల్లోనే మొత్తం బస్సును మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు నిద్రలో ఉండటంతో దాదాపు 20 మందికి పైగా మరణించారు. కొందరు ప్రాణాలతో బయటపడ్డారు కానీ, చాలా మంది లోపల చిక్కుకుని కాలిపోయారు. బస్సు డ్రైవర్లు ఇద్దరు మంటల నుంచి తప్పించుకుని పరిగెత్తారని, వారిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. గాయపడిన వారని సమీప ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.

Just In

01

Xiaomi: ప్రీమియం ఫీచర్లతో త్వరలో లాంచ్ కానున్న రెడ్‌మి నోట్ 15 సిరీస్

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం