Sandeep Raj: యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరో గా రూపొందుతున్న చిత్రం ‘మోగ్లీ’. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాణంలో రూపొందింది. హీరోయిన్ గా సాక్షి మహాదోల్కర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలో మెరవనున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 12, 2025న ప్రపంచ వ్యాప్తంగా థియోటర్లలో విడుదల అవ్వడానికి సిద్దంగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి కొడుకు కాల భైరవ ఈ సినిమాకు బాణీలు అందించారు. అయితే, ఈ సినిమా చుట్టూ ఇటీవలి కొన్ని నెలలుగా వివాదాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, బండి సరోజ్ కుమార్ దర్శకుడు సందీప్ రాజ్ మధ్య వచ్చిన విభేదాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
Read also-AI in Tollywood: సినిమాల్లో ఏఐ టెక్నాలజీ వాడకం పెరుగుతుందా?.. దీనివల్ల జరిగే అనార్థాలు ఏమిటి?
ది వరల్డ్ ఆఫ్ మోగ్లీ’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బండి సరోజ్ విలన్ లుక్‌కు ప్రేక్షకులు మెచ్చుకున్నారు. కానీ, యూట్యూబ్ కామెంట్స్‌లో తన పేరు ప్రస్తావనలు డిలీట్ చేయబడి, థంబ్‌నెయిల్ మార్చబడి, బాట్స్ ఉపయోగించి హీరో ప్రమోషన్ చేస్తున్నారని సరోజ్ ఆరోపించాడు. “నేను 8 నెలలు రిమ్యునరేషన్ లేకుండా పని చేశాను, సందీప్ రాజ్ అభ్యర్థనపైనే. ఇది ప్రమోషన్ కాదు, ఇన్‌సెక్యూరిటీ” అని అతడు ట్వీట్ చేశాడు. ఇది ‘చీప్ నెపోటిజం’ అని విమర్శించాడు. ఈ పోస్ట్ వైరల్ అవ్వగానే, సరోజ్ దాన్ని డిలీట్ చేసి, “మిస్‌అండర్‌స్టాండింగ్” అని అపాలజీ చేసి, అకౌంట్ డీయాక్టివేట్ చేశాడు. ఈ ఘటన పరిశ్రమలో నెపోటిజం, డిజిటల్ మార్కెటింగ్ మానిప్యులేషన్ చర్చలకు దారితీసింది.
Read also-Kishkindhapuri: ఓటీటీలో ‘కిష్కింధపురి’ రాకింగ్.. అతి తక్కువ టైమ్‌లోనే..!
తాజాగా ‘సయ్యారే’ సాంగ్ లాంచ్ ఈవెంట్ హైలైట్స్ అయింది. ఎంఎం కీరవాణి ముఖ్య అతిథిగా, రోషన్ కనకాల, సాక్షి మహాదోల్కర్, ఇతర టీమ్ సభ్యులు పాల్గొన్నారు. కాల భైరవ స్వయంగా పాడిన ఈ రొమాంటిక్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ, బండి సరోజ్ కుమార్ హాజరు కాకపోవడంతో మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి. “విభేదాలు కారణంగా ప్రమోషన్స్‌కు దూరమయ్యాడు” అని సోషల్ మీడియాలో చర్చ చలరేగింది. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ సరోగ్ కుమార్ తో ఉన్న విభేదాల గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. “అలాంటిదేం లేదు. బయట చూసేవాళ్ళకి అలా అనిపించడానికి కారణమేంటంటే… సరోజ్ కుమార్ నాకన్నా పెద్దోడు. ఆయనపై రెస్పెక్ట్ ఉన్నప్పుడు ‘బ్రో, బాగుంది.. చాలా బాగా చేశావ్’ అని చెప్పగలను. కానీ అందరితో క్లోజ్‌గా ఉండకపోవటం వల్ల దూరంగా అనిపిస్తుంది. బేసిక్‌గా మేము ఇద్దరమే ఉన్నప్పుడు మాట్లాడుకునేది వేరు. కొన్ని సార్లు హీరో ఇలా చేస్తే నీకు ఈజీ అవుతుందని సరోజ్ సలహా ఇచ్చాడు. ఆయన ఎక్స్‌పీరియన్స్‌తో ప్రాసెస్ ఈజీ చేశాడు. నేను అది ఫాలో అయ్యాను. క్రియేటివ్ డిస్కషన్స్ వచ్చినా, తను అనుకున్నట్టు చేసి చూపించి ఓకే అడిగాడు. అలాంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా చేస్తే సూపర్ అని నేను చెప్పినప్పుడు ఒప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి. షూటింగ్ చాలా హ్యాపీగా జరిగింది. విభేదాలు ఏమీ లేవు” అని స్పష్టం చేశారు.
