The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), డైరెక్టర్ మారుతి (Director Maruthi) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) అప్‌డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంటుంది. పలు వాయిదాల అనంతరం రాబోయే సంక్రాంతి రేసులోకి వెళ్లిపోయింది. రీసెంట్‌గా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే, ఆ రోజు కేవలం ఒక కొత్త పోస్టర్‌తో సరిపెట్టడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నిరాశను వెంటనే పటాపంచలు చేస్తూ, చిత్ర నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఫ్యాన్స్‌కు ఒక సంచలన ప్రకటనతో డబుల్ ట్రీట్ ఇచ్చారు. తాజాగా జరిగిన ‘మోగ్లీ’ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్‌తో పాటు ఫ్యాన్స్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే..
Also Read- Surender Reddy: సురేందర్ రెడ్డి బ్రేక్‌కు కారణమేంటి? నెక్ట్స్ సినిమా ఎవరితో?
రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు ట్రీట్
‘ది రాజా సాబ్’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను నవంబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో నిరాశలో ఉన్న అభిమానులు ఒక్కసారిగా ఉప్పొంగిపోతున్నారు. మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. రాబోయే సంక్రాంతికి సినిమా రిలీజ్ కాబోయే ముందు, ఫ్యాన్స్‌కు మరో బిగ్ ట్రీట్ ఇవ్వనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. నవంబర్ 5న ఫస్ట్ సింగిల్ విడుదలైన తర్వాత, సినిమా రిలీజ్‌కు ముందు మరొక రిలీజ్ ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒకే సినిమా నుంచి వరుసగా రెండు పెద్ద అప్‌డేట్స్ రాబోతుండటంతో, ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ ఖుషీలో ఉన్నారు. నిజంగా ఇది ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ అనే చెప్పుకోవచ్చు.
Also Read- Tollywood OG: ఈ హీరోలకు నెక్ట్స్ ఓజీలు అయ్యే సీనుందా?
మోగ్లీ ప్రమోషన్స్‌లో బిజీ బిజీ
నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రకటన చేసిన ‘మోగ్లీ’ సినిమా విషయానికి వస్తే.. ఇది యంగ్ హీరో రోషన్ కనకాల నటిస్తోన్న రెండో చిత్రం. జాతీయ అవార్డు గ్రహీత, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ అత్యంత భారీగా ఈ సినిమాను నిర్మించారు. 2025 అడవి నేపథ్యంలో సాగే ఈ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాను డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. మొత్తంగా, ఒకవైపు రోషన్ కనకాల ‘మోగ్లీ’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న టీజీ విశ్వ ప్రసాద్, మరోవైపు ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ను సంతృప్తి పరుస్తున్నారు. నవంబర్ 5న రాబోయే ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

