Lokah Chapter 1: ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయిన లోకా చాప్టర్ 1..
lokha ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Lokah Chapter 1: ఓటీటీలో సందడీ చేసేందుకు రెడీ అయిన లోకా చాప్టర్ 1..

Lokah Chapter 1: దుల్కర్ సల్మాన్ నిర్మించిన మలయాళ సూపర్ హిట్ చిత్రం లోకా చాప్టర్ 1. ఈ సినిమా ఆగస్టు 28, 2025న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. రూ.30 కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌తో నిర్మించబడింది కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి, అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం విజయం సాధించడంతో, దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు.

నటి నటులు 

కళ్యాణి ప్రియదర్శన్ (చంద్ర – మహిళా సూపర్ హీరో), నస్లెన్ (సన్నీ), శాండీ మాస్టర్ (నచియప్ప గౌడ), అరుణ్ కురియన్, చందు సలీం కుమార్, నిశాంత్ సాగర్, విజయరాఘవన్ తదితర పాత్రల్లో నటించారు. ఇక అతిథి పాత్రల్లో టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ నటించారు.

Also Read: Kurnool Bus Fire Accident: బెర్త్ కోసం చూస్తే పరలోకానికే.. స్లీపర్ డిజైన్లలో భారీ లోపాలు.. మంటలోస్తే తప్పించుకునే దారేది!

లోకా చాప్టర్ 1 ఏ ఓటీటీలో చూడొచ్చంటే? 

రిలీజ్ అయి నెలలు దాటుతున్నా కూడా ఇంత వరకు ఏ OTT లోను విడుదల కాలేదు. అభిమానులు ఆ రోజు రిలీజ్ అవుతుంది.. ఈ రోజు రిలీజ్ అవుతుందని ట్విట్టర్‌లో పోస్టు లు పెట్టారు. ఇంకొందరూ ఇది అక్టోబర్ 2025లో విడుదల కావచ్చని అంటున్నారు. అయితే, ఇప్పుడు వారి అంచనాలే నిజమయ్యాయి. జియో హాట్‌స్టార్‌లో అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.

Also Read: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. సీఎం చంద్రబాబు, పవన్ సంతాపం

లోకా చాప్టర్ 1 ఓటీటీ ఆలస్యానికి ఇది కూడా ఒక కారణం?

ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి ఎందుకు లేట్ అయిందంటే.. దీనికి ఒక ప్రధాన కారణం ఉంది. లోకా చాప్టర్ 1 ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పెంచడం కోసం డిజిటల్ విడుదల వాయిదా వేయడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

 

Just In

01

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!