MLA Murali Naik: ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక నజర్ వేసిన మహబూబాబాద్ ఎమ్మెల్యే రోజుకో పాఠశాలను పర్యవేక్షిస్తూ తనదైన శైలిలో అధికారులకు సూచనలు చేస్తున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అనంతరం మోడల్ స్కూల్ పరిస్థితులపై ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆగ్రహంవ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా లో ప్రభుత్వ గురుకులాలు, బడులపై, ఉపాధ్యాయుల పని తీరు పై మురళి నాయక్ (MLA Murali Naik) దృష్టి పెట్టారు.
Also Read: MLA Murali Naik: పారిశుద్ధ్య విషయంలో అలసత్వం వహించొద్దు: ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్
విద్యా వ్యవస్థను బలోపేతం
రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తోందని, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎవ్వరూ ఆటంకం కలిగించకూడదని ఎమ్మెల్యే హెచ్చరించారు. టీచర్ల మధ్య విభేదాలు, పాఠశాలపై నిర్లక్ష్యం చూపడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తనిఖీ సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. గతం లో ఎన్నడూ లేని విధంగా రేవంత్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం పని చేస్తోందని, ఉపాధ్యాయులు కూడా ఆ బాధ్యతను గుర్తుంచుకోవాలన్నారు. మోడల్ స్కూల్ అంటే అందరికీ ఆదర్శం కావాలని, సమస్యల కేంద్రంగా మారకూడదని హెచ్చరించారు.
Also Read: Teachers Association: దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి!
