Spirit Movie: ప్రభాస్-సందీప్ రెడ్డి వంగ కాంబో: ‘స్పిరిట్’ హైప్ బాంబ్!
స్టార్ హీరో ప్రభాస్‌తో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చేతులు కలిపిన సినిమా ‘స్పిరిట్’ . ఇది కేవలం ఒక మూవీ కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మొత్తం వణికించడానికి రెడీ అవుతున్న భారీ బ్లాస్టర్. పాన్-ఇండియా లెవెల్‌లో రచ్చ చేసేందుకు రెడీ అయ్యే ఈ కాప్ యాక్షన్ డ్రామా, ప్రేక్షకుల మనసుల్లో ఇప్పటికే రేకెత్తిస్తోంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ధీమా.. “ఇది బాక్సాఫీస్‌ని షేక్ చేసి, రికార్డులను కూడా బ్రేక్ చేస్తోంది.” అంటూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు.
సందీప్ ప్లానింగ్: ప్రెస్టీజ్ ప్రాజెక్ట్, థాయ్‌లాండ్ షూటింగ్!
సందీప్ రెడ్డి వంగ.. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘అనిమల్’ వంటి హిట్స్ ఇచ్చిన మాస్టర్‌మైండ్. ఈ సారి ‘స్పిరిట్’ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. స్క్రిప్ట్ రాయడం పూర్తి అయింది, 70% BGM కంపోజ్ అయింది. షూటింగ్ సెప్టెంబర్ 2025 నుంచి స్టార్ట్ అయింది. ప్రభాస్ నవంబర్‌లో జాయిన్ అవుతాడు.
థాయ్‌లాండ్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు!
ప్రభాస్ కాంప్లెక్స్ కాప్ రోల్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇది అతని కెరీర్‌లో కొత్త డైమెన్షన్. 2026 దసరా సమయంలో రిలీజ్ అవుతుంది. భూషణ్ కుమార్ ప్రొడక్షన్‌లో T-సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యాకింగ్ బడ్జెట్ భారీగా, ఎక్స్‌పెక్టేషన్స్ స్కై హై.
Also Read: Operation Hidma: ఆపరేషన్ హిడ్మా సక్సెస్ అవుతుందా..? ఇక మావోయిస్టుల పని అయిపోయినట్లేనా..!
ప్రభాస్ సినిమాలో రవితేజ, త్రివిక్రమ్ వారసులు..
ప్రభాస్ సినిమా కాబట్టి, ఆడియో టీజర్‌తోనే ఈ మూవీ పై హైప్‌ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. అయితే, ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు పెద్ద ప్లానింగ్‌తో వెళ్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో రవితేజ, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ వారసులు కూడా వర్క్ చేస్తున్నారు. రవితేజ తనయుడు మహాధన్ భూపతిరాజు, త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్ ‘స్పిరిట్’ చిత్ర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా వర్క్ చేస్తున్నారు. దీంతో సందీప్ రెడ్డి వద్ద టెక్నికల్ మెలకువలు నేర్చుకునేందుకు ఇద్దరు స్టార్ వారసులు ‘స్పిరిట్’లో జాయిన్ కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు
