rera logo
క్రైమ్

RERA: ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రెరా షోకాజ్ నోటీసులు

Real Estates: నిబంధనలు ఉల్లంఘించిన సోనెస్టా ఇన్‌ఫినిటి, హస్తినా రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రెరా షోకాజ్ నోటీసులు పంపింది. ఈ రెండు ప్రాజెక్టులు రెరా రిజిస్ట్రేషన్ పొందకుండానే సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారాలు చేస్తున్నాయని తమ దృష్టికి వచ్చినట్టు వివరించింది. ఇది రెరా నిబంధనల ఉల్లంఘనేనని, వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది.

గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ వెనుక జయభేరి పైన్ కాలనీలో స్కై విల్లాస్ నిర్మాణాలకు సోనెస్టా ఇన్‌ఫినిటి ప్రమోటర్ రెరా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని, రిజిస్ట్రేషన్ పొందకుండానే సోషల్ మీడియా ద్వారా బ్రోచర్ విడుదల చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని రెరా ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, హస్తినా రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్స్.. శ్రీశైలం హైవే సమీపంలో కడ్తాల్ టౌను ఫార్మా సిటీ వద్ద బ్రిస్సా ప్రాజెక్టుకు రెరా రిజిస్ట్రేషన్ పొందలేదని, కానీ, సోషల్ మీడియా ద్వారా బ్రోచర్ విడుదల చేసి ప్రజలను, కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రచారాలు చేస్తున్నారని వివరించింది. ఈ విషయాలు రెరా దృష్టికి వచ్చింది. దీంతో ఆ ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసు జారీ చేసిన వారం రోజుల్లో సంజాయిషీ సమర్పించాలని ఆదేశించినట్టు అథారిటీ వెల్లడించింది.

రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఏజెంట్లు తప్పనిసరిగా తమ ప్రాజెక్టులను రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేదంటే వారు నిబంధనలు ఉల్లంఘించినవారవుతారని పేర్కొంది. ఇండ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేయదలిచినవారు కూడా రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టులలో మాత్రమే కొనుగోలు చేయాలని, ప్రీలాంచ్ ఆఫర్లు, మోసపూరిత ప్రకటనలు నమ్మరాదని రెరా సూచించింది.

Just In

01

Bigg Boss Telugu 9: మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..

Telangana: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త జోష్.. ఎందుకంటే?

Hyderabad Collector: చాకలి ఐలమ్మ వర్శిటీ పనులపై.. కలెక్టర్ హరిచందన కీలక ఆదేశం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేది అప్పుడేనా?

Summit of Fire: ఖతార్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు.. మరో కొత్త ఆపరేషన్