Transport Department: రవాణాశాఖ మరో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఎన్పోర్స్ మెంట్ టీంలను ఏర్పాటు చేసి నిబంధనలు అతిక్రమించే వాహనాలపై, అధిక లోడు వాహనాలపై, అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయం బాగున్నప్పటికీ ఆ ఎన్పోర్స్ మెంట్ బృందాలకు వాహనాలు ఎలా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎంవీఏ, ఏఎంవీఐలకు వాహన సదుపాయం లేకపోవడంతో ఎలా వారు తనిఖీలు చేస్తారనే ప్రశ్న మొదలైంది. అంతేకాదు ఇప్పటివరకు టీంలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఆ ఎంతమందితో ఏర్పాటు చేస్తారు. ఏయే సమయాల్లో వారికి విధులు కేటాయిస్తారనేది ఇప్పుడు ఉద్యోగుల్లోనే చర్చనీయాంశమైంది.
ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్ర వ్యాప్తంగా 15 చెక్ పోస్టులు ఉన్నాయి. అయితే వాటిని తొలగిస్తూ(మూసివేస్తూ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఒక్కో చెక్ పోస్టులో 8 నుంచి 12 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో ఎంవీఐలు, ఏఎంవీఐలు, కానిస్టేబుల్స్, హోంగార్డులు పనిచేస్తున్నారు. అన్ని చెక్ పోస్టుల్లో కలిపి సుమారుగా 120 మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే చెక్ పోస్టుల తొలగింపుతో ఆ సిబ్బందిని ఆయా డీటీఓ ఆర్టీఓ కార్యాలయాల్లో కార్యాలయాల్లో సరెండర్ చేశారు. అయితే వారందరికీ ఏ విధులు అప్పగిస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. మరికొంతకాలం చెక్ పోస్టుల కొనసాగుతాయని భావించినప్పటికీ ఏసీబీ దాడులు నిర్వహిస్తుండటం, లెక్కల్లో చూపని డబ్బులు వెలుగులోకి వస్తుండటం, ప్రైవేటు వ్యక్తులు విధులు నిర్వహిస్తుండటం వెలుగులోకి రావడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భావించిన ప్రభుత్వం చెక్ పోస్టులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ చెక్ పోస్టుల్లో విధులు నిర్వహించే ఉద్యోగులను ఎలా వినియోగిస్తారనే చర్చమొదలైంది.
ఎన్ ఫోర్స్ మెంట్ టీంలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు
చెక్ పోస్టుల తొలగింపుతో ఇల్లీగల్ యాక్టీవిటీస్ పెరిగే అవకాశం ఉండటంతో ఎన్ ఫోర్స్ మెంట్ టీంలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. చెక్ పోస్టులో పనిచేస్తున్న సుమారు 120 మందితో పాటు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న మరో 112 మంది ఏఎంవీఐలు ఉన్నారు. మొత్తం 232 మంది అధికారులు సిబ్బంది ఉన్నారు. అయితే వీరితో ఎన్ ఫోర్స్ మెంట్ బృందం ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ఎంవీఐ, ఇద్దరు ఏఎంవీఐ హోంగార్డులు ఒకరు, కానిస్టేబుల్ ఒకరు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో 40 నుంచి 45 టీంలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఎప్పటినుంచి ఈ బృందాలు తనిఖీలు చేపడతాయనేదానిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం.
ఏం చేయాలి? తనిఖీలు ఎలా చేయాలి
ఇది ఇలా ఉంటే ఎన్ ఫోర్స్ మెంట్ టీంలు ఏం చేయాలి? తనిఖీలు ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి అనే దానిపై శిక్షణ ఇస్తారా? ఇస్తే ఎన్ని రోజులపాటు ఇస్తారా? లేకుంటే ఓరల్ గా మోటివేషన్ క్లాస్ చెబుతారా? అనేది ఉద్యోగుల్లో పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ తరుణంలో ఏయే నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. ఆర్టీఏ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై ఎంత జరిమానా విధించాలి అనే వివరాలపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందా? అనేది కూడా చర్చకు దారితీసింది. ఎంవీఐలకు ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది కూడా హాట్ టాపిక్ అయింది.
ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు ఎలా తనిఖీ చేపడతాయి
మరోవైపు ప్రస్తుతం చెక్ పోస్టుల్లో విధులు నిర్వహించే ఎంవీఐ, ఏఎంవీఐలకు ప్రభుత్వం వాహనాలు ఇవ్వలేదు. సొంత వాహనాలతోనే విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు వాహనాలు లేకుండా ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు ఎలా తనిఖీ చేపడతాయనేది ఇప్పుడు ఉద్యోగుల్లోనే చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఆగస్టు 28న చెక్ పోస్టుల ఎత్తివేతకు కేబినెట్ నిర్ణయం తీసుకోగా, అప్పుడే హయర్ వెహికిల్స్ ఇవ్వాలని చర్చించినట్లు సమాచారం. కానీ ఇప్పటివరకు కేటాయించలేదు. సడన్ గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంవీఐలు, ఏఎంవీఐలు వాహనాల ఎలా అనేదానిపై సమాలోచనలో పడినట్లయింది. ఇది ఇలా ఉంటే కొంతమంది ఆర్టీఓలకు సైతం ప్రభుత్వం వాహనాలు కేటాయించలేదని సమాచారం. వారికి సైతం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని సమాచారం. ఏది ఏకమైనప్పటికీ వాహనాలు లేకుండా ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు ఎలా తనికీలు నిర్వహిస్తాయనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Also Read: Warangal Collector: పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలి.. జిల్లా కలెక్టరేట్ కీలక వ్యాఖ్యలు
