CM Revanth Reddy (IMAGE CREDIT: TWITTER)
తెలంగాణ

CM Revanth Reddy: చరిత్రలో నిలిచేలా ఉస్మానియా కొత్త ఆసుపత్రి.. అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

CM Revanth Reddy: హైద‌రాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుప‌త్రులు, మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణానికి ఒక అధికారిని నియ‌మించాల‌ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. ఆయా నిర్మాణాల‌పై 24x7 సదరు అధికారి ప‌ర్యవేక్షించేలా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని సీఎం సూచించారు. వచ్చే జూన్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

Also Read: CM Revanth Reddy: రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులను తక్షణమే మూసివేయాలి.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

అధునాత‌న ప‌రిక‌రాల ఏర్పాటుకు త‌గిన‌ట్లు గ‌దులు, ల్యాబ్‌లు, ఇత‌ర నిర్మాణ‌లు ఉండాలి

ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణంపై త‌న నివాసంలో సీఎం స‌మీక్ష నిర్వహించారు. నూత‌న ఆసుప‌త్రి అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు అధునాతన వైద్య ప‌రిక‌రాల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని, ఇందుకు సంబంధించి త‌గిన‌ ప్రణాళికలను సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. అధునాత‌న ప‌రిక‌రాల ఏర్పాటుకు త‌గిన‌ట్లు గ‌దులు, ల్యాబ్‌లు, ఇత‌ర నిర్మాణ‌లు ఉండాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌కు సీఎం సూచించారు. ఆసుప‌త్రి నిర్మాణ ప‌నుల‌తో పాటు స్థానికుల‌కు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేప‌ట్టాల‌న్నారు. ఆసుప‌త్రి నిర్మాణ ప‌నుల వేగ‌వంతానికి వైద్యారోగ్య శాఖ‌, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారుల‌తో సమన్వయ క‌మిటీని వెంట‌నే ఏర్పాటు చేయాల‌ని సీఎం ఆదేశించారు.

త‌గిన ప్రణాళికలు రూపొందించుకోవాలి

ఈ క‌మిటీ క్షేత్ర స్థాయిలో ప‌ర్యటిస్తూ ప్రతి ప‌ది రోజుల‌కోక‌సారి స‌మావేశ‌మై ఏవైనా సమస్యలకు చెక్ పెడుతూ ప‌నులు వేగంగా జ‌రిగేలా చూడాల‌ని సీఎం ఆదేశించారు. ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబ‌స్తు ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించి ముందుస్తుగానే త‌గిన ప్రణాళికలు రూపొందించుకోవాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ఆసుప‌త్రికి వివిధ ర‌హ‌దారుల‌ను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పట్నుంచే రూపొందించాల‌ని ఆర్ అండ్ బీ అధికారుల‌కు సీఎం సూచించారు.ఈ స‌మీక్షలో సీఎం ప్రిన్సిప‌ల్ సెక్రటరీలు వి.శేషాద్రి, శ్రీ‌నివాస‌రాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్‌, డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి, వివిధ శాఖ‌ల ఉన్నతాధికారులు వికాస్‌రాజ్‌, క్రిస్టియానా జోంగ్తూ, ఇలంబ‌ర్తి, ముషార‌ప్ అలీ ఫ‌రూఖీ, హ‌రిచంద‌న త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also Read: CM Revanth Reddy: బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి: సీఎం రేవంత్ రెడ్డి

Just In

01

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

Private Buses: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు.. తెలంగాణలో తొలిరోజే 4 బస్సులు సీజ్