CM Revanth Reddy (imagecredit:swetcha)
తెలంగాణ

CM Revanth Reddy: బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) చీకటి ఒప్పందం చేసుకున్నాయని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై కుట్రకు ప్లాన్ చేశాయని ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. తెలంగాణ సమాజం దీనిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని చార్మినార్ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌(Salman Khurshid)కు అవార్డును బహూకరించి సత్కరించారు.

ఓటు హక్కు వయో పరిమితి

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ, రాజీవ్ స్ఫూర్తితో ప్రజా పాలన కొనసాగుతున్నదని అన్నారు. ప్రజా పాలనలో అన్ని కులాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్రాల శాసనసభలకు పోటీ చేసే వయో పరిమితిని 25 నుంచి 21 ఏళ్ల తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో త్వరలోనే తీర్మానం చేస్తామని ప్రకటించారు. దేశ పరిపాలనా యంత్రాంగంలో 21 ఏళ్లకు ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS) అధికారులుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు, అసెంబ్లీకి పోటీ చేసే వయసును 21 ఏళ్లకు ఎందుకు తగ్గించరాదని ప్రశ్నించారు. ప్రభుత్వాలను నిర్ణయించే అధికారం యువతకు ఉండాలన్న సంకల్పంతో రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తు చేశారు.

Also Read: BC Bandh: బీసీ బంద్ ర్యాలీలో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత

విచ్ఛిన్నం చేసే మతతత్వ వాదులు

అదే క్రమంలో ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడడానికి రాజీవ్ గాంధీ త్యాగాలను గుర్తు చేస్తూ, గడిచిన 35 ఏళ్లుగా క్రమం తప్పకుండా సద్భావనా యాత్ర సంస్మరణ కార్యక్రమాన్ని జరుపుతున్న నిర్వాహకులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మతతత్వ వాదులు చూస్తున్నారని, వారు బ్రిటీషర్ల కంటే ప్రమాదకరమని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Min Uttam Kumar Reddy) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Min Ponguleti Srinivas Reddy), సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాలరావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: NIMS Hyderabad: విద్యార్థి మృతికి ఉద్యోగులే కారణమా?.. నిమ్స్‌పై స్వేచ్ఛ వరుస కథనాలు

Just In

01

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

Private Buses: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు.. తెలంగాణలో తొలిరోజే 4 బస్సులు సీజ్