Medaram Jatara: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర (Medaram Jatara) ఏర్పాట్లను 8 జోన్లు, 31 సెక్టార్లగా విభజించినట్లు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సబ్యసాచి ఘోష్ తెలిపారు. సచివాలయంలో వివిధ శాఖల ఆఫీసర్లతో ఆయన జాతర ఏర్పాట్లపై రివ్యూ నిర్వహించారు. జాతర సమయంలో 10 నుంచి 12 వేలమంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటారని, ప్రతి జోన్‌కు జోనల్ ఆఫీసర్‌ను నియమించనున్నట్లు సబ్యసాచి ఘోష్ తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ ఇప్పటికే రూ.150 కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.90 కోట్లు సివిల్ పనులకు, రూ.60 కోట్లు నాన్ సివిల్ పనులకు కేటాయించామన్నారు. ఈ ఏర్పాట్లన్నీ నవంబర్ 30 నాటికి పూర్తవుతాయని ఆయన తెలిపారు.
Also Read: Medaram Jatara: మేడారం కీర్తి ప్రపంచానికి తెలిసేలా చేయాలి.. అధికారులకు మంత్రి ఆదేశం
ప్రత్యేక దృష్టి..
మేడారం జాతరకు పకడ్భందీగా ఏర్పాట్లుమేడారంలో 24 శాశ్వత టవర్లు, 20 సెల్ ఆన్ వీల్స్, 350 వైఫై పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 1,050 ఎకరాల్లో 49 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తుండగా, దాదాపు 4.5 నుంచి 6 లక్షల వాహనాలు నిలిపే సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. జాతర ప్రధాన ప్రాంతంగా నిర్ణయించిన జంపన్న వాగు వద్ద తాత్కాలిక రహదారి కూలిపోయిన కారణంగా మరమ్మత్తు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 517 బోరుపాయింట్లు/నీటి వనరులు, 250 కిలోమీటర్ల రహదారులపై లైటింగ్ పనులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 24+9 ఫారెస్ట్ రోడ్లు అభివృద్ధి చేస్తుండగా, ఆర్ అండ్ బీ శాఖ ద్వారా రూ.42 కోట్లతో ఆలయం చుట్టూ రహదారులు, రూ.92 కోట్లతో ప్రధాన రహదారులు నిర్మించబడుతున్నాయన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని సబ్యసాచి ఘోష్ ఆదేశించారు.
Also Read: Seethakka: ఆడబిడ్డల గౌరవానికి ప్రతీక బతుకమ్మ.. సీతక్క కీలక వ్యాఖ్యలు
