The Raja Saab (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

The Raja Saab: బర్త్ డే స్పెషల్.. పాటన్నారు, కేవలం పోస్టర్ మాత్రమేనా!

The Raja Saab: అక్టోబర్ 23 అనగానే ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండుగ. రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) పుట్టినరోజున ఫ్యాన్స్ డబుల్ ఆనందంలో ఉంటారు. అందులోనూ ప్రభాస్ చేతిలో ఇప్పుడు అరడజనుకు పైగా సినిమాలు ఉండటంతో, ఆ సినిమాల నుంచి ఫ్యాన్స్ అప్డేట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నా, అందులో రెండు మాత్రమే ప్రస్తుతం యాక్టివ్‌లో ఉన్నాయి. అవి ‘ది రాజా సాబ్’ అండ్ ‘ఫౌజి’. వీటిలో ‘ఫౌజి’ (Fauzi) సినిమా రీసెంట్‌గానే సెట్స్‌పైకి వెళ్లింది. ‘ది రాజా సాబ్’ మాత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. రీసెంట్‌గానే ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను వదిలారు. ట్రైలర్ విడుదల సమయంలోనే, ప్రభాస్ పుట్టినరోజుకు ఫస్ట్ సింగిల్ వదులుతామని మేకర్స్ మాటిచ్చారు. కానీ, మేకర్స్ పాట కాకుండా కేవలం ఒక పోస్టర్ మాత్రమే విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడిదే ఫ్యాన్స్‌కు ఆగ్రహం వచ్చేలా చేస్తుంది. ముందుగా మాట ఇవ్వడం ఎందుకు? ఆ మాట మీద నిలబడలేకపోవడం ఎందుకు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మేకర్స్ వదిలిన పోస్టర్ విషయానికి వస్తే..

Also Read- Venkatesh: ‘మన శంకరవరప్రసాద్ గారు’లో వెంకీ మామ ఎంట్రీ అదుర్స్.. చిరుతో చేతులు కలిపి..

కేవలం పోస్టర్ మాత్రమే..

రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషనల్‌లో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మిస్తోన్న క్రేజీ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). ఈ మూవీ నుంచి ప్రభాస్ బర్త్‌డేను (HBD Prabhas) పురస్కరించుకుని మేకర్స్ ఓ కలర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసి బర్త్ డే విశెస్ తెలియజేశారు. ఈ పోస్టర్‌ను మేళతాళాలతో ప్రభాస్‌ను ఊరి ప్రజలు ఆహ్వానిస్తున్నట్లుగా డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌లో ప్రత్యేకమైన శ్వాగ్, స్టైల్‌‌తో ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు. త్వరలోనే ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు‌గా ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. థమన్ కారణంగానే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఆలస్యమైందనేలా టాక్ వినబడుతుంది. సాంగ్ ఫైనల్ మిక్సింగ్ పూర్తి కాకపోవడంతో.. కేవలం పోస్టర్‌తోనే ఈసారికి మేకర్స్ సరిపెట్టేశారు.

Also Read- OG movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన పవన్ కళ్యాణ్ బ్లాక్ బాస్టర్ సినిమా ‘ఓజీ’.. ఎక్కడంటే?

సంక్రాంతికి సక్సెస్ పక్కా..

రాబోయే సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేలా జనవరి 9న ‘ది రాజా సాబ్’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హారర్ కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా దర్శకుడు మారుతి ఈ సినిమాను రూపొందిస్తున్నారని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వేల్యూస్‌తో అన్ కాంప్రమైజ్డ్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ బ్యానర్ నుంచి వచ్చిన ‘మిరాయ్’ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అదే ఊపులో రాబోతున్న ‘ది రాజా సాబ్’ సినిమా కూడా భారీ విజయం సాధిస్తుందని నిర్మాత నమ్మకంగా చెబుతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ రెస్పాన్స్‌ను రాబట్టుకోగా, సినిమా కూడా భారీ సక్సెస్ అవుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: ఓ యువకుడు గంజాయి సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్..!

Vijayawada Airport Fire: గన్నవరం విమానశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు

CM Revanth Reddy: రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్..!

Harish Rao Father Death: హరీశ్ రావు తండ్రి మరణం.. సీఎం రేవంత్ సంతాపం.. పరామర్శించిన కేసీఆర్

Baby Sale Case: దారుణం.. చెల్లిని అమ్మవద్దు అని తల్లి కాళ్ల మీద పడి వేడుకున్న కూతుర్లు.. ఎక్కడంటే?