Siddipet welfare schemes: జిల్లా లోని లబ్ధిదారులకు బుధవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి గడ్డం వివేక్ కళ్యాణలక్ష్మి, శాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు, సన్నబియ్యం అందిస్తామని, ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 26 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు, రాష్ట్రంలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. పథకాల అమలులో సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు.
Read also-Maganti Sunitha: సునీత గోపీనాథ్ భార్య కాదు.. ఆమె నామినేషన్ ను రద్దు చేయాలి : తారక్ ప్రద్యుమ్న
అనంతరం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంఎల్సీ యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె. హైమావతి, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, ఆర్డీఓలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణలక్ష్మి పథకం ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలో 381 మంది లబ్ధిదారులకు రూ.3.81 కోట్లు, దుబ్బాకలో 410 మందికి రూ.4.10 కోట్లు, గజ్వేల్‌లో 204 మందికి రూ.2.04 కోట్లు, మొత్తం 995 మంది లబ్ధిదారులకు రూ. 9.95 కోట్లు విలువైన చెక్కులను పంపిణీ చేశారు. జిల్లాలో 74,386 కొత్త రేషన్ కార్డులు మంజూరు కాగా. నియోజక వర్గాల వారిగా సిద్దిపేట – 24,073, గజ్వేల్ – 15,659, దుబ్బాక – 14,819, హుస్నాబాద్ – 9,738, జనగాం – 7,687, మానకొండూర్ – 2,410 కార్డులు మంజూరు చేశారు.
Reada also-Ponnam Prabhakar: తెలంగాణలో రవాణాశాఖ చెక్కు పోస్టులు రద్దు చేశాం.. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం
జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 11,201 ఇండ్లు మంజూరు కాగా, వీటిలో 8,929 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయి. మహలక్ష్మి (గ్యాస్ సిలిండర్) పథకం ద్వారా మొత్తం 1,79,300 గృహాలకు రూ.2,282.69 లక్షలు మంజూరు చేశారు. గృహజ్యోతి పథకం ద్వారా 2,04,250 గృహాలకు రూ. 9,782.04 లక్షలు చెల్లించబడ్డాయి. రైతు బరోసా పథకం ద్వారా జిల్లాలో మొత్తం 3,20,379 మంది రైతులకు రూ.355.68 కోట్లు నిధులు మంజూరు చేశారు. మహిళా ఉచిత ప్రయాణం (RTC) జిల్లాలోని 6.94 లక్షల మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.228.67 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
