Mahesh Kumar Goud: మత విద్వేషాలను రెచ్చకొడుతూ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి స్థాయిలో బుర్ర లేనట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు కోదండ రామ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ మద్దతుపై చర్చించారు.
Also Read: PCC Mahesh Kumar Goud: ఆదిత్య కన్స్రక్షన్ పై పూర్తి స్థాయిలో ఎంక్వైయిరీ.. మహేష్ కుమార్ గౌడ్
కోదండ రామ్ పాత్ర చరిత్రలో నిలిచిపోయేది
ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావంలో కోదండ రామ్ పాత్ర చరిత్రలో నిలిచిపోయేదని గుర్తు చేశారు. నిస్వార్ధంగా నిజాయితీగా రాష్ట్ర సాధన కోసం కోదండ రామ్ కృషి చేశారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా గాడి తప్పిందో ప్రజలకు తెలుసునన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ నిరంకుశ పాలన విముక్తి కోసం 2023 లో తామంతా కలిసి పోరాటం చేశామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారి సహకారం మరిచిపోలేమన్నారు. ఉద్యోగ నియామక రూప కల్పనలో కోదండ రామ్ సలహాలు సూచనలు విలువైనవన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగుతుందన్నారు. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీ తో గెలవడం ఖాయమన్నారు.
Also Read: PCC Mahesh Kumar Goud: పదవులపై కోరికలు లేవ్.. పార్టీని పవర్‌లో ఉంచడమే నా లక్ష్యం..?
