Railway Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడుతున్న నిరుద్యోగ యువకులకు గుడ్ న్యూస్.. భారతీయ రైల్వేస్ దేశవ్యాప్తంగా 5,810 ఖాళీలను భర్తీ చేయనుంది. రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) ద్వారా జారీ చేసిన CEN 06/2025 నోటిఫికేషన్ ప్రకారం, నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలలో (గ్రాడ్యుయేట్ లెవల్) వివిధ పోస్టులకు భర్తీలు జరుగుతాయి. డిగ్రీ హోల్డర్లు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 వరకు అవకాశం ఉంది. దీని ద్వారా రైల్వేలో స్థిరమైన కెరీర్ అవకాశాలు వేగంగా దొరుకుతాయి.
అర్హతలు
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ (లేదా సమానమైనది) పూర్తి చేసినవారు అర్హులు.
ప్రత్యేక స్కిల్స్: జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ / సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు ఇంగ్లీష్ లేదా హిందీలో కంప్యూటర్ టైపింగ్ నైపుణ్యం తప్పనిసరి.
వయసు పరిధి (జనవరి 1, 2026 నాటికి): 18–33 సంవత్సరాలు కలిగి ఉండాలి.
OBCలకు 3 సంవత్సరాలు, SC/STలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు విస్తరణ.
పోస్టులు & ఖాళీలు
గ్రాడ్యుయేట్ కేటగిరీలో ఈ ప్రధాన పోస్టులు ఉన్నాయి. మొత్తం 5,810 ఖాళీలు వివిధ జోన్లలో పంపిణీ చేయబడతాయి.
పోస్ట్ పేరు – ఖాళీల సంఖ్య
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ – 161
స్టేషన్ మాస్టర్ – 615
గూడ్స్ ట్రైన్ మేనేజర్ – 3,416
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ – 921
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 638
ట్రాఫిక్ అసిస్టెంట్ – 59
జీతం
పోస్టు ప్రకారం లెవల్ 4, 5, 6 పే స్కేల్‌లో జీతం: చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ / స్టేషన్ మాస్టర్: రూ. 35,400 (లెవల్ 6)
ట్రాఫిక్ అసిస్టెంట్: రూ.25,500 (లెవల్ 4)
మిగిలిన పోస్టులు (గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్): రూ. 29,200 (లెవల్ 5)
ఇది ప్లస్ డియర్‌నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) మొదలైన ప్రయోజనాలతో ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT): టైర్-1 (స్క్రీనింగ్) & టైర్-2 (మెయిన్ ఎగ్జాం).
స్కిల్ టెస్ట్: టైపింగ్ స్కిల్ టెస్ట్ (పోస్టు ప్రకారం) లేదా కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV).
మెడికల్ ఎగ్జామినేషన్.
