Minister Adluri Lakshman (imagecredit:twitter)
Politics, తెలంగాణ

Minister Adluri Lakshman: హరీష్ రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్.. ఎమన్నారంటే..?

Minister Adluri Lakshman: సీనియర్ మంత్రిగా అనుభవం ఉన్న హరీష్ రావు(Harish Rao) కేబినెట్ ను అవమానించడం దారుణమని మంత్రి అడ్లూరి లక్ష్​మణ్(Minister Adluri Lakshman)​ ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. హరీష్ రావు లెక్క పైకి నవ్వి,లోపల రాజకీయాలు చేయడం తనకు తెలియదన్నారు. బీఆర్ఎస్(BRS) పార్టీ చీలికకు హరీష్​ రావే కారణమన్నారు. హరీష్​ చేసే అంతర్గత రాజకీయాలు అందరికీ తెలుసునన్నారు. హరీష్​ రావు(Harish Rao), ఆర్ఎస్ ప్రవీణ్​ కుమార్(RS Praveen Kumar) లెక్కలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు.

దండు పాళ్యం బ్యాచ్ .. 

కేబినెట్ లో వ్యక్తిగత అంశాలు చర్చకు రాలేదని తాను సిద్ధిపేట్ వెంకటేశ్​వర స్వామీ దేవాలయంలో నిండుస్నానం చేస్తానని, హరీష్​ కూడా రావాలని సవాల్ విసిరారు. తనతో పాటు హరీష్​ కూ ప్రమాణం చేసే దమ్ముందా? అంటూ నిలదీశారు. అవసరమైతే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా తీసుకువస్తానని నొక్కి చెప్పారు. కేబినెట్ ను దండు పాళ్యం బ్యాచ్ అనడం సరికాదన్నారు. అబద్దాలకు కేరాఫ్​ బీఆర్ ఎస్ పార్టీ అని విమర్శించారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం పవర్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలపై దాదాపు 600 లకు పైగా ఎఫ్​ ఐఆర్ లు నమోదు చేశారన్నారు.

Also Read: Siddu Jonnalagadda: సినిమాలో ఇంటర్వెల్ గురించి నిజాలు బయటపెట్టిన సిద్ధు జొన్నలగడ్డ..

ప్రస్తుతం గురుకులాల్లో 

ఇక మాఫియా, డాన్లు, కాంట్రాక్టులు, కమిషన్ల గురించి బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. బ్లాక్‌ మెయిలింగ్‌ చేయడంలో దిట్ట అయిన బాల్క సుమన్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మంత్రుల గురించి మాట్లాడే ముందు కేసీఆర్‌(KCR) పదేళ్ల పాలనపై ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రవీణ్‌ కుమార్‌ నేతృత్వంలో గురుకులాల పరిస్థితిని, ప్రస్తుతం గురుకులాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుంటే బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం కాంగ్రెస్‌ ఎంత ప్రాధాన్యతిస్తుందో స్పష్టమవుతోందన్నారు. కేసీఆర్‌ హయాంలో గురుకులాలు అస్తవ్యస్తంగా ఉన్నా… నోరు ఎత్తని ప్రవీణ్‌ కుమార్‌ ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఉద్యమం పేరుతో యువతను, విద్యార్థులను రెచ్చగొట్టిన బాల్క సుమన్‌ బీఆర్‌ఎస్‌లో పదవులు అనుభవించారే కానీ, యువత కోసం ఎప్పుడు పోరాడలేదన్నారు. సొంత మంత్రులపైనే నిఘా పెట్టి బ్లాక్‌ మెయిలింగ్‌ చేసిన కేసీఆర్‌ కుటుంబానికి దాసోహమైన ప్రవీణ్‌ కుమార్‌, బాల్క సుమన్‌ లకు కాంగ్రెస్‌ మంత్రులపై మాట్లాడే హక్కే లేదని కొట్టిపరేశారు.

Also Read: Diwali Safty Alert: దీపావళి వేళ వైద్యారోగ్య శాఖ మంత్రి కీలక ఆదేశాలు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది