Harish Rao (IMAGE CREDIT: SWETCHA REPORTER)
Politics

Harish Rao: కాంగ్రెస్‌ పాలనలో బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టింది.. హరీష్ కీలక వ్యాఖ్యలు

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి అని మాజీ మంత్రి తన్నీరు హరీష్(Harish Rao) రావు ధ్వజమెత్తారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖానను  పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బస్తీలో ఉండే ప్రజలను సుస్తీ చేసి నయం చేసేలా కేసీఆర్ బస్తీ దవాఖానలు ఏర్పాటుచేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తే హైదరాబాదులో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారన్నారు. బీఆర్ఎస్ పాలనలో 110 రకాల మందులు ఉచితంగా అందించే వాళ్ళమని, 130 రకాల పరీక్షలను ఉచితంగా చేసి పేషంట్ల ఫోన్లకే రిపోర్టులు పంపించే వాళ్ళం అన్నారు.

Also Read: Harish Rao: పంచాయతీలు పెంచుకోవడానికే క్యాబినెట్ మీటింగ్: హరీష్ రావు

40 రకాల మందులు సప్లై లేదు 

కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టిందని మండిపడ్డారు. ఆరు నెలల నుండి జీతం రావడం లేదన్నారు. బస్తీ దవాఖానలో పనిచేసే సిబ్బందికి ఆరు నెలల నుంచి జీతాలు రాకపోతే వారు పని ఎలా చేస్తారని ప్రశ్నించారు. చెప్పడమేమో ఒకటో తారీకు అందరికీ జీతాలు ఇస్తామని చెప్తున్నా ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని మండిపడ్డారు. కేవలం 60, 70 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి 40 రకాల మందులు సప్లై లేదన్నారు. టెస్టులలో బి12, డీ3 టెస్టులకు రీ ఏజెంట్లు సప్లై లేకపోవడం వల్ల అన్ని రకాల టెస్టులు జరగడం లేదని ఆరోపించారు. బస్తీ దవాఖనలో మందులు సరఫరా చేసే తెలివి ప్రభుత్వానికి లేదన్నారు.

జీతాలు వస్తున్నాయా లేదా అనే రివ్యూ చేసే కాంగ్రెస్ ప్రభుత్వంని  తెలివిలేదా?

ప్రభుత్వ సిబ్బందికి జీతాలు వస్తున్నాయా లేదా అనే రివ్యూ చేసే కాంగ్రెస్ ప్రభుత్వంనికి తెలివి లేదా? అని నిలదీశారు. హాస్పిటల్లో కేసీఆర్ కిట్టు ఇవ్వకపోవడం వల్ల 20% డెలివరీలు ప్రైవేటు ఆసుపత్రికి బదిలీ అయ్యాయని ఆరోపించారు. ఎంతసేపు మద్యం దుకాణాలు పెంచుదామా, సారా ఎట్లా అమ్ముదామా, పైసలు ఎట్ల సంపాదిద్దామా, అని తప్ప వేరే ఆలోచన లేదు రేవంత్ రెడ్డికి లేదని దుయ్యబట్టారు. వైన్ షాపుల టెండర్లకు రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచి అడ్డగోలుగా డబ్బు సంపాదించాలని ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

డాక్టర్లకు, సిబ్బందికి వెంటనే జీతాలను విడుదల చేయాలి

రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క రూపాయి కూడా ఈ హెచ్.ఎస్, జే.హెచ్.ఎస్ కు నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు. నగరానికి నాలుగు దిక్కుల్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ప్రారంభిస్తే రెండేళ్ల నుంచి పనులు జరగడం లేదన్నారు. బస్తీ దవాఖానలో డాక్టర్లకు, సిబ్బందికి వెంటనే జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బస్తీ దావఖానాలో 110 రకాల మందులు అందుబాటులో ఉంచాలని, 134 రకాల వైద్య పరీక్షలు బస్తీ దవాఖానలో పూర్తిగా ఉచితంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

జూబ్లీహిల్స్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలని కోరారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్కు ఓటేస్తే బస్తి దవాఖానలలో మందులు లేకున్నా, డాక్టర్లు లేకున్నా, వైద్య పరీక్షలు లేకున్నా నాకే ఓటేశారు అని సీఎం అనుకుంటాడు… ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తిచూపాలంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపు నిచ్చారు. సీఎం తన కిట్టీ నిండుతోందా లేదా ఆలోచిస్తున్నారు తప్ప పేదలకు ఉపయోగపడే కేసీఆర్ కిట్ల గురించి ఆయనకు ఎందుకు ? అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కార్ కు బుద్ధి రావాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.

Also ReadHarish Rao: పీజీ ప్రవేశాల నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలి.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది