Mulugu District (IMAGE CREDIT: SWETCHA REPOTER)
నార్త్ తెలంగాణ

Mulugu District: పోరుకన్నా.. ఊరుమిన్నా సత్ఫలితాలు.. ఎంత మంది మావోయిస్టుల లొంగుబాటు తెలుసా?

Mulugu District: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్తంగా అమలుపరుస్తున్న పోరుకన్నా ఊరు మిన్నాకార్యక్రమంలో ములుగు జిల్లా పోలీస్ శాఖ సత్ఫలితాలను సాధిస్తోంది. గడిచిన జనవరి నుంచి నేటి వరకు వివిధ క్యాడర్లలో ఉన్న మావోయిస్టులు 84 మంది లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలు మరుగున పడుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో పనిచేసే మావోయిస్టులు ప్రభుత్వ పునరావాస కార్యక్రమానికి ఆకర్షితులై లొంగి పోతున్నట్లు ములుగు జిల్లా (Mulugu District) ఎస్పీ శబరిష్ వెల్లడించారు.

Also Read: Mulugu District: నిబంధనలకు విరుద్ధంగా రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. పట్టించుకోని అధికారులు

నలుగురు మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టు పార్టీ నేతల్లో విభేదాలు వెళ్లడవుతున్న నేపథ్యంలో ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరిష్ ఎదుట నలుగురు మావోయిస్టులు  లొంగిపోయారు. ఈ నలుగురిలో మలేషియా కమాండర్ మడకం మండి తోపాటు ఆ పార్టీ మెంబర్స్ గా పని చేస్తున్న మడవి కోసి, మడవి ఇడుమే, ముజకి దేవ లు ఉన్నారు. ఇందులో మడకం మండికి ఆయనపై ఉన్న రివార్డు తోపాటు తక్షణ పునరావాసం కింద ఆర్థిక సాయాన్ని ఎస్ పి. శబరీష్ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పోరుకన్నా.. ఊరుమిన్నా కార్యక్రమానికి ఆకర్షితులై గడిచిన జనవరి నుంచి నేటి వరకు 84 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు వెల్లడించారు.

ప్రతి ఒక్కరికి బెన్ఫిట్స్ అందజేస్తున్నాం

84 మందిలో ముగ్గురు డి వి సి ఎం సభ్యులు, 11 మంది ఏసీఎం సభ్యులు, 28 మంది పార్టీ సభ్యులు, 22 మంది మలేషియా కమిటీ సభ్యులతో పాటు మరో ఆర్టీసీ సభ్యుడు లొంగిపోయినట్లుగా తెలిపారు. లొంగిపోయిన నలుగురు వివిధ నేర ఘటనల్లో భాగస్వాములు అయ్యారని చెప్పారు. సరెండర్ పాలసీలో భాగంగా ప్రతి ఒక్కరికి బెన్ఫిట్స్ అందజేస్తున్నామని వెల్లడించారు. సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేసే వారికి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు పార్టీ కళాభాలను వదిలివేసి అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని కోరారు. స్వచ్ఛందంగా లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల పునరావాస పథకాలను వర్తింప చేస్తామని చెప్పారు.

 Also Read: Mulugu District: పోరు కన్నా.. ఊరు మిన్న.. కార్యక్రమంతో సత్ఫలితాలు..?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!