Man Attacked A Young Woman With A knife In A Love Affair In OldCity:హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ప్రేమ ఆ యువతి పాలిట శాపమైంది. ఆ యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. కత్తిపీటతో దాడి చేయటంతో యువతి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం చావు బతుకుల మధ్య యువతి ఆసుపత్రిలో పోరాడుతుండగా పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇక అసలు వివరాల్లోకి వెళితే పాతబస్తీ ఛత్రినాకకు చెందిన శ్రావ్యకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో విడాకులు తీసుకున్నారు. గౌలిపురకు చెందిన మణికంఠ, శ్రావ్యలు చిన్ననాటి నుంచి స్నేహితులు ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని శ్రావ్యకు మణికంఠ ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె అంగీకరించలేదు.
Also Read: ప్రియుడి మోజులో భర్తని చంపిన భార్య
గత కొన్ని నెలలుగా అక్కడే నివసిస్తున్న శ్రావ్య కాస్మోటిక్స్ వర్క్ చేస్తుంటుంది. ఈ క్రమంలో మణికంఠతో శ్రావ్య దూరంగా ఉంటోంది. ఆమె మరొకరితో ప్రేమ వ్యవహారం నడుపుతుందన్న అనుమానం పెంచుకున్న మణికంఠ మంగళవారం ఉదయం శ్రావ్య ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఇంట్లోని కత్తి పీఠతో శ్రావ్యపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. శ్రావ్య అరుపులు విన్న స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోంది. తీవ్రగాయాల పాలైన ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు.