TG Weather Update: రాష్ట్రంలో రానున్న వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం నుండి రానున్న రోజుల్లో క్రమంగా బంగాళకాతంలో భారీ అల్పపీడనం ఎర్పడే అవకాశం ఉదని వాతవరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇటు తెలంగాణ(Telangana) మరియు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు రేపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది అందుకుగాను రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామని అధికారులు తెలిపారు.
Also Read; Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ పై స్పెషల్ ఫోకస్.. రంగంలోకి 40 కాంగ్రెస్ క్యాంపెయినర్లు
రానున్న రోజుల్లో..
రాష్ట్రంలో నేడు రేపు తేలిక పాటి వర్షాలు కురుస్తాయని, రానున్న రోజుల్లో వాటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అధికారుల అంచనా ప్రకారం.. ముఖ్యంగా నల్గోండ, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వరపర్తి, నారాయనపేట, జోగులాంబ గద్వాలజిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని తెలిపారు. జగిత్యాల, సిద్దిపేట, ములుగు, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read; Louvre Museum: చారిత్రక మ్యూజియంలో పట్టపగలు దోపిడీ.. నెపోలియన్ కాలం నాటి నగలు చోరీ
