Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9)లో వీకెండ్ ముగిసి 43వ రోజుకు చేరుకుంది. ఆరవ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న భరణి (Bharani), సండే ఎలిమినేట్ అయ్యారు. ఇక మండే అనగానే నామినేషన్స్ రచ్చ ఉంటుందనే విషయం తెలియంది కాదు. అయితే ఈ వారం నామినేషన్స్‌ను బిగ్ బాస్ చాలా వెరైటీగా ప్లాన్ చేశారు. బిగ్ బాస్ 7వ వారంలోకి అడుగు పెట్టిన క్రమంలో.. సోమవారం ఎపిసోడ్ (Monday Episode) నామినేషన్స్‌తో మొదలైంది. ఈ నామినేషన్స్‌లో ఆయేషా, రీతూల (Ayesha vs Rithu) మధ్య ఆసక్తికర పోరు నడిచింది. రీతూని ఆయేషా డైరెక్ట్ నామినేట్ చేసి, చాలా దారుణంగా అవమానించింది. నామినేట్ చేయడానికి ఆమె చెప్పిన కారణాలు చూస్తే అంతా షాకవుతారు కూడా. ఈ నామినేషన్స్‌కు సంబంధించి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ఏముందంటే..
Also Read- Anaganaga Oka Raju: పటాకాయల షాప్‌లో పట్టు చీరలు దొరుకుతాయా.. ‘అనగనగా ఒక రాజు’ దీవాళి బ్లాస్ట్!
నామినేషన్స్ శంఖారావం
‘‘ఈ బిగ్ బాస్ రణరంగంలో నామినేషన్ హక్కు కూడా పోరాడి గెలవాల్సిందే అనే విషయం మీకిప్పటికే అర్థమై ఉంటుంది. ఈ వారం నామినేషన్స్ శంఖారావాన్ని ఇమ్మానుయేల్, ఆయేషా పూరిస్తారు. బిగ్ బాస్ ఇల్లు వేలాది బెలూన్స్‌తో నిండి ఉంది. అక్కడున్న బెలూన్స్ కొన్నింటిలో నామినేషన్స్ టికెట్స్ దాగున్నాయి. ఆ టిక్కెట్స్ పొందిన వారికి నామినేట్ చేయడానికి కావాల్సిన వివిధ శక్తులు లభిస్తాయి..’’ అని బిగ్ బాస్ చెప్పగానే ఇమ్ము, ఆయేషా బెలూన్స్‌ని పగలకొడుతూ ఆ శక్తుల కోసం వెతకడం మొదలు పెట్టారు. బెలూన్స్ మొత్తం పగలగొట్టిన తర్వాత.. ‘మీకు దొరికిన చిట్స్ ఎన్నో, అవి ఏంటో చెప్పండి?’ అని బిగ్ బాస్ అడిగారు. ‘బిగ్ బాస్ నామినేట్ 1 అని టు కార్డ్స్ దొరికాయి. డైరెక్ట్ నామినేషన్ అని ఒక కార్డు దొరికింది’ అని ఆయేషా చెప్పింది. ‘రెండేమో నామినేట్ 2 అని వచ్చాయి, మూడేమో నామినేట్ 1 వచ్చాయి’ అని ఇమ్ము చెప్పాడు. అందులో ఉన్న పవర్‌ని ఎవరితో పంచుకోవాలో మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ సూచించారు. కళ్యాణ్, దివ్య, రమ్య, తనూజ, రీతూ వంటి వారితో వాటిని పంచుకున్నారు.
ఎందుకంత యాటిడ్యూడే నీకు?
ఇక డైరెక్ట్ నామినేషన్ ఛాన్స్ ఆయేషాకు వచ్చింది. ఆమె రీతూని డైరెక్ట్ నామినేట్ చేసింది. ‘నువ్వు, నీ ఓవరాక్షన్ ఈ ఇంట్లో నాకసలు నచ్చలేదు. వచ్చిందే లవ్ కంటెంట్ కోసం’ అంటూ రీతూని డైరెక్ట్ నామినేట్ చేసినట్లుగా బిగ్ బాస్‌కు ఆయేషా తెలిపింది. ఆ అమ్మాయి చెప్పే పాయింట్స్ ఏమైనా వినాలని అనుకుంటున్నారా? అని బిగ్ బాస్ అడిగితే.. ‘నాకసలు ఆ అమ్మాయి చెప్పేది వినాలని లేదు. నేను నామినేట్ చేశాను.. ఇంక అంతే’ అని ఆయేషా చెప్పేసింది. ఆ తర్వాత ఆయేషా, రీతూల మధ్య వాగ్వివాదం నడిచింది. ‘ఏ.. ఎందుకంత యాటిడ్యూడే నీకు’ అంటూ రీతూపై ఆయేషా ఫైరయింది. నీ అహంకారం, నీ గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదు అని ఆయేషా అంటే.. పోవే అంటూ రీతూ రిప్లయ్ ఇచ్చింది. మొత్తంగా అయితే ఈరోజు నామినేషన్స్ రచ్చ అయితే మాములుగా ఉండదనేది ఈ ప్రోమో తెలియజేస్తుంది. చూద్దాం.. ఫైనల్‌గా ఎవరెవరు నామినేషన్స్‌లో ఉంటారో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
