KTR: కమిషన్ల కోసం క్యాబినెట్ మంత్రులు కొట్లాడితే పరిపాలన పట్టించుకునేది ఎవరు అని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నిలదీశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన మాజీ డీసీఎంఎస్ చైర్మన్, మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, ఆయన కుమారుడు పెద్దషాపూర్ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, 2018లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన అంజిబాబు దంపతులు తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో వారికి కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు.
ప్రజలపై బుల్డోజర్లు
ఈ సందర్భంగా మాట్లాడుతూ, నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పాలన, శాంతిభద్రతలు, ప్రభుత్వ విశ్వసనీయతకు పరీక్షగా నిలుస్తుందని అన్నారు. రెండేళ్లుగా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పెద్ద ప్రాజెక్టులను నిలిపివేస్తూ, ప్రజలపై బుల్డోజర్లను ప్రయోగించిందని ఆరోపించారు. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ పనితీరుకి పరీక్షగా నిలుస్తుందని చెప్పారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాటకాలను నమ్మకుండా, 420 గ్యారంటీల పేరుతో చేసిన మోసాన్ని గుర్తుంచుకొని ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో బుల్డోజర్ రాజ్ వచ్చిందని, పరిపాలన పరమైన సంపూర్ణ వైఫల్యం తెలంగాణలో కొనసాగుతున్నదని మండిపడ్డారు. హైదరాబాద్(Hyderabada) నగరంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటు పడిందని, దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా పేర్కొన్నారు.
Also Read: Singareni Bonus 2025: సింగరేణి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉద్యోగులకు భారీగా బోనస్.. ఎంతో తెలిస్తే షాకే!
బీసీ బిల్లు పెట్టేలా ప్రయత్నం
ప్రజలకు పనికి వచ్చే ఒక్క కార్యక్రమం చేపట్టకుండా కేవలం ప్రచారం కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ పార్టీకి, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP)కి చిత్తశుద్ధి ఉంటే, వారి ఎంపీలు తెలంగాణ గల్లీలో దొంగ పోరాటం చేయకుండా ఢిల్లీలో తమ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకువచ్చి పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టేలా ప్రయత్నం చేయాలని సవాల్ చేశారు. చేయాల్సిన చోట పని చేయకుండా కేవలం బీసీలను మోసం చేసే ఏకైక ఉద్దేశంతోనే కాంగ్రెస్(Congress), బీజేపీలు తెలంగాణ(Telangana)లో నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బీసీల 42 శాతం రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ తీసుకువచ్చే ప్రయత్నం బీజేపీ, కాంగ్రెస్‌లు చేయాలని డిమాండ్ చేశారు. మేడారం జాతర పనుల వివాదాల గురించి మాత్రమే కాకుండా టెండర్ల నుంచి మొదలుకొని బిల్లుల విడుదల వరకు ప్రతి సందర్భంలోనూ కమీషన్ల కోసమే కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రులు కొట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు.
Also Read: Mega Heroes: ఒకే వేదికపై రెండు సినిమాల అప్డేట్స్.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
