Bhatti-Vikramarka (Image source Whatsapp)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Bhatti Vikramarka: మహిళలకు కీలక సందేశం ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలి

మధిర నియోజకవర్గ మహిళలు భారతదేశానికే ఆదర్శంగా నిలవాలి
గేదెలకు షెడ్డులు.. ఆపై సోలార్ సిస్టమ్‌తో విద్యుత్
గేదెలకు ఆహారం అందించడంలో యువతకు ఉపాధి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వెల్లడి

మధిర, స్వేచ్ఛ: పాల ఉత్పత్తుల ద్వారా మధిర నియోజకవర్గం మహిళా సంఘాల సభ్యులు, భారతదేశానికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆకాంక్షించారు. ఆదివారం మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళ డెయిరీ లబ్ధిదారులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించి, మాట్లాడారు. ఇందిరా మహిళా డెయిరీ తన చిరకాల వాంఛ అని, ఉమ్మడి రాష్ట్రంలో 2013 సంవత్సరంలో మధిర నియోజకవర్గంలోని 52,000 మహిళా సంఘాల సభ్యులకు రెండు గేదెలు కొనివ్వాలని భావించానన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే మధిర నియోజకవర్గంలో మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పాటు వారు సమాజంలో పోటీపడి బతకాలని ఈ పథకాన్ని అమలులోకి తీసుకురావడంతో తన చిరకాల వాంఛ నెరవేరింది అన్నారు. ప్రతి మహిళకు రెండు గేదెలను ఇవ్వడంతో పాటు వాటిని కాపాడడానికి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, గేదెలు ఉండటం కోసం కొట్టాలు మంజూరు చేయడంతో పాటు, సోలార్‌ను కూడా మంజూరు చేస్తామన్నారు.

Read Also- Louvre Museum: చారిత్రక మ్యూజియంలో పట్టపగలు దోపిడీ.. నెపోలియన్ కాలం నాటి నగలు చోరీ

రోజువారి కూలీ పనులకు వెళ్లే మహిళలు తాము గేదెలు తీసుకుంటే వాటిని ఎవరు చూస్తారు.. గడ్డి ఎవరు వేస్తారు, దానా ఎవరు వేస్తారు.. అన్న భావన ఉండవచ్చని, అయితే అందుకోసం కూలి పనులకు వెళ్లినప్పటికిని గేదెలకు దానా, గడ్డి సరఫరా చేయడం కోసం నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తామన్నారు. వారే వచ్చి సరఫరా చేసేలా ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం ఉపాధి కల్పిస్తున్న యువతకు ట్రాలీ ఆటోలు కూడా ఇప్పిస్తామన్నారు. ప్రతి మండలాన్ని మూడు భాగాలుగా విభజించి, ప్రతి 10 గ్రామాలను యూనిట్‌గా ఏర్పాటు చేసి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. భూమి లేకున్నా కూడా గేదెలను మంజూరు చేస్తామని అన్నారు. భూమి ఉన్న నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేలా వారి పొలాలలో గడ్డిని పెంచిపించి గడ్డిని కూడా సరఫరా చేస్తామన్నారు. ప్రతి నెల గేదెలను వాటి ఆరోగ్యాన్ని పరీక్షించడం కోసం డాక్టర్లు వస్తారని అంబులెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. డాక్టర్లు గేదెల ఆరోగ్యాన్ని పరీక్షించడంతోపాటు గేదె ఆరోగ్యం ఎలా ఉంది అనే రిపోర్టు కూడా రూపొందిస్తారన్నారు. ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నాయని గుర్తిస్తారన్నారు.

Read Also- Jogulamba Gadwal: జోగులాంబ గద్వాలలో దారుణ దాడి.. మధ్యవర్తి మోసంతో బాధితుడిపై దాడి, రక్షణ కోరుతూ ఆవేదన

ప్రతి గేదెకు సంబంధించి హెల్త్ కార్డును అందజేస్తామన్నారు. ప్రతి లబ్ధిదారుడు పాల ఉత్పంతులు పెంచేలా చూడాలని కనీసం 10 లీటర్లకు పైగా రోజు విక్రయించుకునేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. బోనకల్లు మండలంలోని ఇందిరా మహిళా శక్తి పాల పరిశ్రమను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ పరిశ్రమను అమూల్,విజయ డైరీ, హెరిటేజ్ పరిశ్రమల మాదిరిగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఇక్కడి పాల ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అమ్మేలా ఏర్పాటు చేస్తామని అన్నారు. పాల ఉత్పత్తులను పెంచడం ద్వారా మదిర నియోజకవర్గ మహిళలు 1000 కోట్లు సంపాదించేలా చర్యలు తీసుకుంటామని ఈ విధంగా 5 ఏళ్లలో 5000 కోట్లు సంపాదించాలని ఆకాంక్షించారు. ఇందుకు రాష్ట్రంలోనే మధిర నియోజకవర్గం లో ప్రాథమిక పునాది పడిందని అన్నారు. ఈ ఏడాది 20 వేల మంది మహిళలకు గేదలను పంపిణీ చేస్తామని వచ్చే ఏడాది మరో 20 వేల మందికి, ఆ తర్వాత మిగిలిన 20వేల మందికి గేదెలను పంపిణీ చేస్తామన్నారు.

మమత, చింతకాని:
‘‘ఇందిరా మహిలా డైరీ ద్వారా గేదెలు ఇవ్వడం సంతోషం. రెండు గేదెలు రోజుకు 18 లీటర్ల పాలు ఇస్తున్నాయి. రోజుకు పాల ద్వారా రూ.600 వస్తున్నాయి. ఇందిరా డైరీ ద్వారానే కాకుండా చుట్టుపక్కల వారికి పాలు అమ్ముతున్నాం’’.

భాగ్యమ్మ, బోనకల్:
‘‘పేదలైన మమ్మల్ని గుర్తించి గేదెలు ఇప్పివ్వడం ద్వారా మమ్మల్ని లక్షాధికారుల చేశారు. నెలకు మేము రూ 12 రూ సంపాదిస్తున్నాం. కూలీలుగా కాకుండా గౌరవంగా జీవిస్తున్నాం’’.

శైలజ, ముదిగొండ:
‘‘ఇందిరా డైరీ కింద నాకు మేలు జాతికి చెందిన రెండు గేదెలు ఇచ్చారు. నాకు 11 లీటర్ల పాలు వస్తున్నాయి. వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. రోజు 10 లీటర్ల పాలు బయట అమ్ముతున్నాను. లీటర్ పాలు రూ.80 లకు అమ్ముకుంటున్నాను’’.

లక్ష్మీ, మధిర:
‘‘నాకు రెండు గేదెలు ఇచ్చారు. నాకు ఉపాధి దొరికింది. డైరీ గేదెలు వల్ల మా కుటుంబం మూడు పూటలా అన్నం తింటున్నాము. పాలు అమ్ముకుని మా కుటుంబం గౌరవంగా జీవనం సాగిస్తున్నాం’’.

ఉష, ఎర్రుపాలెం:
‘‘మాకు రెండు గేదెలు ఇచ్చారు. రెండు గేదెలు రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తున్నాయి. గేదెలు వచ్చిన దగ్గరనుంచి ఇప్పటి వరకు మాకు వరకు రూ12 వేలు వచ్చాయి. వాటితో మా బిడ్డ కాలేజి ఫీజులు కట్టము. ఇందిరా మహిళ డైరీ వల్ల మేము శాంతిషంగా జీవిస్తున్నాం’’.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?