Chiranjeevi: దీపావళి సందర్భంగా సినీ నిర్మాత బండ్ల గణేష్ సినీ ప్రముఖులకు ఘనంగా పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. అంతే కాకుండా విక్టరీ వెంకటేష్, శీకాంత్, అనిల్ రావిపూడి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, లిటిల్ హార్ట్స్ హీరో మౌళి తదితరులు ఈ పార్టీకి హాజరయ్యారు. అయితే0 ఈ పార్టీలో ఒక స్పెషల్ మూమెంట్ మెగా ఫ్యాన్స్‌ను మరింత ఆనందంలో ముంచేసింది. మెగాస్టార్‌కు కేటాయించిన స్పెషల్ కుర్చీ రాయల్ లుక్ ను చూసిన ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. మెగాస్టార్ ఎక్కడ ఉన్నా స్టారే అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. అందులో కూర్చొనే అర్హత ఆయనకే ఉందంటూ తెలుపుతున్నారు.
Read also-Siddu Jonnalagadda: సినిమాలో ఇంటర్వెల్ గురించి నిజాలు బయటపెట్టిన సిద్ధు జొన్నలగడ్డ..
బండ్ల గణేష్ తను ఇచ్చిన పార్టీలో మెగా స్టార్ చిరంజీవిని గౌరవంతో ఆహ్వానించారు. పార్టీలో మెగాస్టార్‌కు ప్రత్యేకంగా లగ్జరీ కుర్చీ కేటాయించారు. ఈ కుర్చీలో కూర్చుని చిరంజీవి స్మైల్‌తో ఉన్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూమెంట్ చిరంజీవి ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది. రాయల్ లుక్ లో చిరు ను చూసిన ఫ్యాన్స్ ఆయన లో ఉన్న ఆ గ్రేస్ ఎప్పటికీ తగ్గదు అంటున్నారు. పార్టీలో శ్రీకాంత్, మరింత మంది తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీపావళి సెలబ్రేషన్స్‌లో అందరూ ఆనందంగా కాల్ చేసుకున్నారు. బండ్ల గణేష్ ఈ పార్టీని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. చిరంజీవి ఆకర్షణీయ ఔట్‌ఫిట్‌లో కనిపించి, అందరినీ ఆకట్టుకున్నారు.
Read also-Bandla Ganesh: తేజ సజ్జాపై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్లగణేష్.. అది నిజమేనా..
చిరంజీవి తన ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. బండ్ల గణేష్ ఈ గౌరవానికి కారణమై, తెలుగు సినిమా పరిశ్రమలో తన స్నేహితులతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ పార్టీ తెలుగు సినిమా వర్గాల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఈ మూమెంట్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటారనడంలో సందేహం లేదు. దీనిని చూసిన మెగా స్టార్ ఫ్యాన్స్ ‘ఆ సింహాసనం మీద కూర్చొనే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్ర సేనుడిది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
#Chiranjeevi at Bandla Ganesh Diwali party pic.twitter.com/kPjvbIticP
— Aristotle (@goLoko77) October 18, 2025
