Regina Cassandra: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడా చూసిన ఈ ముద్దుగుమ్మ పేరే వినబడుతోంది. ఒక్కసారిగా రెజీనా హాట్ టాపిక్ గా మారింది. “ఏంటీ, రెజీనా ప్రెగ్నెంటా?” అని జనం ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఈ వార్త సినీ ఇండస్ట్రీలో కూడా చక్కర్లు కొట్టింది. అసలు ఆ కథ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
రెజీనా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో “ఆ రోజు రాత్రి నేను ప్రెగ్నెంట్ అయ్యాను” అని చెప్పడం, అందర్ని షాకింగ్ కి గురి చేసింది. అయితే, ఇంకా పెళ్లి చేసుకోని రెజీనా తల్లి కాబోతుందన్న వార్త అందరినీ కంగుతినిపించింది. కొందరు ” సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు, “పెళ్లైనా కాకపోయినా, డేటింగ్‌లో ఇలాంటివి చాలా కామన్ ” అంటూ రాసుకొచ్చారు. కానీ, ఈ కథలో బిగ్ ట్విస్ట్ ఏంటో తెలుసా? అసలు రెజీనా ప్రెగ్నెంట్ కాదు? ఆమె ఓ బెంగాలీ స్వీట్‌ని తినడానికి ఈ నాటకం ఆడింది. ఏంటి షాక్ అయ్యారా? అవును, ఇది నిజమే. ఇదంతా ఒక స్వీట్ కోసం చేసిన స్మార్ట్ డ్రామా.
అసలు మ్యాటర్ ఏంటంటే, రెజీనా ఒక రోజు బెంగళూరులో ఉండగా, తనకు ఇష్టమైన మిష్టి దోయ్ తినాలని కోరిక కలిగింది. కానీ ఆ సమయంలో షాప్ మూసేసి ఉంది. ఎంత బతిమిలాడినా “సమయం అయిపోయింది, ఇప్పుడు ఇవ్వలేం” అని షాప్ వాళ్లు చెప్పారు. అయినా, ఆ స్వీట్‌ని ఎలాగైనా తినాలని ఫిక్స్ అయిన రెజీనా, ఇలా థింక్ చేసి, “నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నాను, నాకు ఈ మిష్టి దోయ్ తినాలని చాలా కోరికగా ఉంది” అని చెప్పిందట. ఈ మాట వినగానే షాప్ వాళ్లు ఒక్కసారిగా షాప్ ఓపెన్ చేసి, ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌కి కాదనలేక, రెజీనాకు ఇష్టమైన స్వీట్‌ని ఇచ్చారు. అలా, రెజీనా తన కోరిక తీర్చుకోవడానికి ఈ చిన్న నాటకం ఆడింది.
ఇది తెలిసిన వాళ్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. రెజీనా స్మార్ట్‌నెస్‌కి ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు.
