block-money( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Black Money in Film: కొంత మంది సినీ నిర్మాతలు బ్లాక్ మనీతో సినిమాలు తీస్తారా?.. ఇందులో నిజమెంత?

Black Money in Film: భారత దేశంలో కొన్ని వేల కోట్లుతో సినిమాలు నిర్మిస్తున్నా.. అందులో కొన్ని మాత్రమే బాట పడుతున్నాయి. దాదాపు 80 శాతానికి పైగా సినిమాలు నష్టాల్లోనే ఉంటున్నాయి. అయినా సినిమా తీయడానికి నిర్మాతలు ఎందుకు మక్కువ చూపిస్తున్నారు. అన్నది ఇక్కడ తెలుసుకుందాం. భారతీయ సినిమా పరిశ్రమ, దేశ వినోద రంగంలో అగ్రగామి అయినప్పటికీ, దాని మూలాల్లో బ్లాక్ మనీ (అక్రమ డబ్బు) చాపకింద నీరు లాగా కొనసాగుతోంది. బాలీవుడ్ నుండి కొలీవుడ్ వరకు ఈ ఇండస్ట్రీలో 30-50 శాతం చిత్రాలు బ్లాక్ మనీతో ముడిపడి ఉంటాయని అంచనా. 2025లో ED రైడ్స్, రాజకీయ ఆరోపణలు, సోషల్ మీడియాలో చర్చలు ఈ సమస్యను మళ్లీ ముందుకు తీసుకువస్తున్నాయి. ఇది మనీ లాండరింగ్‌కు మాత్రమే కాకుండా, మాఫియా, డ్రగ్స్, పెయిడ్ రివ్యూలతో కూడా ముడిపడి ఉంది. ఈ ఆర్టికల్‌లో, ఈ విషయాన్ని వివరంగా చూద్దాం.

Read also-Bandla Ganesh: తేజ సజ్జాపై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్లగణేష్.. అది నిజమేనా..

బ్లాక్ మనీ అంటే..

బ్లాక్ మనీ అంటే పన్నులు చెల్లించకుండా సంపాదించిన డబ్బు. అది రియల్ ఎస్టేట్, మాఫియా, రాజకీయ అక్రమాల నుండి వస్తుంది. ఇండియాలో ఇది రూ.22,000 కోట్లకు పైగా ఉందని అంచనా. ఇలాంటి బ్లాక్ మనీని వైట్ గా మార్చుకోవడానికి సినిమా పరిశ్రమకు సులభ మార్గం. ఎందుకు అంటే? సినిమా ‘హై-రిస్క్, హై-రిటర్న్’ వ్యాపారం. బ్యాంకులు లోన్‌లు సులభంగా ఇవ్వవు, కానీ రిటర్న్ భారీ. కాబట్టి, హావాలా ద్వారా బ్లాక్ మనీ తీసుకుని, ఖర్చులుగా చూపించి ‘వైట్ మనీ’గా తిరిగి పొందుతారు. ఇది పన్ను ఎగవేతకు కూడా సహాయపడుతుంది. మధ్యస్థ బడ్జెట్ చిత్రాల్లో (రూ.20-50 కోట్లు) ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే కార్పొరేట్ ఫండింగ్ పెద్ద చిత్రాలకు మాత్రమే.

Read also-Kajal Aggarwal: చెల్లెలికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ.. కాజల్ ఎలాంటి ఫొటోలు షేర్ చేసిందో చూశారా!

మనీ లాండరింగ్ పద్ధతులు

సినిమాల్లో బ్లాక్ మనీని ‘క్లీన్’ చేయడానికి ఇన్‌ఫ్లేటెడ్ ఖర్చులు చూపిస్తారు. స్టార్ నటుల సాలరీలు, వీఎఫ్ఎక్స్ లకు ఖర్చులు అధింకంగా అయ్యారని చూపిస్తారు. క్యాష్ చెల్లింపులు చేసి, రసీదులు ఇవ్వకుండా పన్ను తప్పించుకుంటారు. ఈ సినిమా పరిశ్రమలో బ్లాక్ అండ్ వైట్ నిష్పత్తి 60:40 శాతంగా ఉందని అంచనా. షెల్ కంపెనీలు పెట్టి విదేశాల నుండి ‘కన్సల్టెన్సీ ఫీజ్’గా చూపించి డబ్బు తెచ్చుకుంటారు. ఫ్లాప్ అయిన డబ్బు ‘కోల్పోతారు’. 1990ల నుండి మాఫియా డబ్బు పెట్టి, ఎక్స్‌టార్షన్ చేస్తారు. పెయిడ్ రివ్యూలు, ఫేక్ కలెక్షన్లు కూడా అందులో భాగంగా మారతాయి. బ్లాక్ మనీ పరిశ్రమను బలహీనపరుస్తోంది. ప్రేక్షకులుల్లో సినిమా ఇమేజ్ పడిపోతుంది. ట్రాన్స్‌పరెన్సీ, బ్యాంక్ లోన్‌లు అవసరం.

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది