Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన చెల్లెలు, ఒకప్పటి నటి నిషా అగర్వాల్ (Nisha Aggarwal) పుట్టినరోజు (HBD Nisha Agarwal)ను పురస్కరించుకుని ఇన్‌స్టాగ్రమ్ వేదికగా పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేవలం విషెస్ చెప్పడమే కాకుండా, కాజల్ షేర్ చేసిన కొన్ని బీచ్ ఫోటోలు అభిమానులకు, నెటిజన్లకు ఓ సరికొత్త ట్రీట్‌ను అందించాయి. అక్టోబర్ 18 నిషా అగర్వాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కాజల్ తన చెల్లెలితో కలిసి దిగిన అనేక క్యూట్, అద్భుతమైన ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ముఖ్యంగా కొన్ని బోల్డ్ బికినీ ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. బీచ్ ఒడ్డున, ఇసుకపై కూర్చుని, స్విమ్ సూట్స్‌లో ఈ ఇద్దరు సోదరీమణులు పంచుకున్న ఆప్యాయత, గ్లామర్ అభిమానులకు కనువిందు చేశాయి.
Also Read- Bandla Ganesh: బండ్ల గణేష్ దీవాళి పార్టీ.. టాలీవుడ్ అంతా ఆయన ఇంట్లోనే.. ఏదో ప్లాన్ చేశాడయ్యో!
అందంతో మెస్మరైజ్ చేస్తూ…
వైరల్ అవుతున్న ఫొటోల్లో, కాజల్ అగర్వాల్ తన చెల్లెలు నిషాను ఆలింగనం చేసుకుని, కెమెరాకు చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఒక ఫొటోలో కాజల్ వైట్ కలర్ స్విమ్ సూట్‌లో మెరుస్తుండగా, నిషా బ్లాక్ కలర్ స్విమ్ సూట్‌లో అద్భుతంగా ఉంది. ఇద్దరూ తమ గ్లామరస్ లుక్స్‌తో, ముఖ్యంగా బీచ్ ఒడ్డున ఇచ్చిన పోజులు యువతను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పెళ్లి తర్వాత, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా కాజల్ అందం, ఫిట్‌నెస్ ఏ మాత్రం తగ్గలేదని, నిషా కూడా ఇంకా హీరోయిన్‌గా నటించేంత అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read- Diwali Movies: తుస్సుమన్న దీవాళి వెండితెర టపాసులు.. ఒక్కటంటే ఒక్కటి కూడా పేలలే!
చెల్లికి ప్రేమ సందేశం
ఈ ఫొటోలతో పాటు కాజల్ తన ప్రియమైన చెల్లెలికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ‘హ్యాపీయెస్ట్ బర్త్‌డే టు మై బేబీ నిషా అగర్వాల్. ప్రపంచంలోనే అత్యంత దయగల, అందమైన, మనసున్న వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ఎమోషనల్ నోట్ రాసింది. నిషా పట్ల తనకు ఉన్న ప్రేమ, గౌరవాన్ని వ్యక్తపరుస్తూ ఆమె జీవితం ఎప్పుడూ ఆనందం, కృతజ్ఞత, సక్సెస్‌తో నిండి ఉండాలని కోరుకుంది. ఈ ఫొటోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలుగులో ‘ఏమైంది ఈ వేళ, సోలో’ వంటి చిత్రాలతో నిషా అగర్వాల్ కూడా ప్రేక్షకులకు సుపరిచితురాలే. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో తన అక్కతో కలిసి ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అగర్వాల్ సిస్టర్స్ మధ్య ఉన్న అనుబంధం, స్నేహం ఈ ఫొటోల్లో స్పష్టంగా కనిపించి, ‘సిస్టర్ గోల్స్’ను సెట్ చేశాయని చెప్పవచ్చు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రీ ఎంట్రీ ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. త్వరలోనే ఆమె నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
