Bandla Ganesh Diwali Bash (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Bandla Ganesh: బండ్ల గణేష్ దీవాళి పార్టీ.. టాలీవుడ్ అంతా ఆయన ఇంట్లోనే.. ఏదో ప్లాన్ చేశాడయ్యో!

Bandla Ganesh: బాలీవుడ్‌ (Bollywood)లో ఉండే సెలబ్రేషన్ కల్చర్ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఊపందుకుంటోంది. బాలీవుడ్‌లో ప్రతి పండుగను, ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరుపుకుంటూ సెలబ్రిటీలు సందడి చేస్తుంటారు. ఇది మెల్లమెల్లగా టాలీవుడ్‌లోకి కూడా వచ్చేసింది. ఈ దీపావళి (Diwali) పండుగ సందర్భంగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Producer Bandla Ganesh) తన ఇంట్లో ఏర్పాటు చేసిన గ్రాండ్ పార్టీ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పార్టీకి ఇండస్ట్రీకి చెందిన అగ్ర తారలు, ప్రముఖులు హాజరవడంతో.. ‘బండ్లన్న ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడుగా!’ అనేలా చర్చలు మొదలయ్యాయి. ఈ దీపావళి పార్టీకి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), శ్రీకాంత్, యువ హీరో సిద్దు జొన్నలగడ్డ వంటి స్టార్స్ సహా టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు తరలివచ్చారు. టాలీవుడ్ ప్రముఖులంతా బండ్ల గణేష్ ఇంట్లో ఒకేచోట చేరి దీపావళిని జరుపుకోవడం ఇండస్ట్రీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Also Read- Tollywood Heroines: టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్స్ హవా.. నిలబడాలంటే అదే ముఖ్యం!

మెగాస్టార్ చిరంజీవి మూవీ సెట్లో అందుకేనా?

ఈ పార్టీకి చిరంజీవి హాజరవడంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇటీవల, ప్రముఖ క్రికెటర్ తిలక్ వర్మ‌ను చిరంజీవి సన్మానించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బండ్ల గణేష్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) షూటింగ్ సెట్‌లోనే ఉన్నారు. చిరు, తిలక్ వర్మలతో కలిసి దిగిన ఫొటోని స్వయంగా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బహుశా, చిరంజీవిని ఈ దీపావళి పార్టీకి ఆహ్వానించేందుకే బండ్ల గణేష్ అక్కడికి వెళ్లి ఉంటారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, టాలీవుడ్ ప్రముఖులను ఇంత పెద్ద ఎత్తున ఒకే వేదికపైకి తీసుకురావడంలో బండ్ల గణేష్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

Also Read- Diwali Movies: తుస్సుమన్న దీవాళి వెండితెర టపాసులు.. ఒక్కటంటే ఒక్కటి కూడా పేలలే!

పార్టీ వెనుక పెద్ద ప్లానే ఉందా?

గత కొంతకాలంగా బండ్ల గణేష్ సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. నటుడిగా అడపాదడపా కనిపిస్తున్నా.. నిర్మాతగా మాత్రం భారీ చిత్రాలను ప్రకటించడం లేదు. అయితే, ఆయన ఎప్పుడూ తన ట్వీట్లు, బహిరంగ వేదికల ద్వారా ఇండస్ట్రీలో తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) తో సినిమా చేయాలని, అది కూడా మైత్రీ మూవీ మేకర్స్, డివివి దానయ్య వంటి వారికి ఇస్తున్నాడు తప్పితే.. తనకు పవన్ డేట్స్ దక్కడం లేదని పలుమార్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో, టాలీవుడ్‌లోని అగ్ర హీరోలందరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేయడంతో, ఇది కేవలం పండుగ కోసమే కాదు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించేందుకు, బంధాలను బలోపేతం చేసేందుకు వేసిన వ్యూహాత్మక అడుగుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన బండ్ల గణేష్.. ఈ పార్టీ తర్వాత ఏదైనా స్టార్ హీరోతో కొత్త సినిమాను ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదని, త్వరలోనే ఆయన నుంచి భారీ అనౌన్స్‌మెంట్ రావచ్చని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ గ్రాండ్ పార్టీతో బండ్ల గణేష్ మరోసారి టాలీవుడ్‌లోని అందరి కళ్లలో పడటం, ఆయన కెరీర్‌ మరో కీలక మలుపు తిరగడం ఖాయమని భావించవచ్చు. చూద్దాం.. ఏం జరుగుతుందో?

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!