K Ramp review: కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ థియేటర్లు నిండాయా..
k-ramp-review( image:X)
ఎంటర్‌టైన్‌మెంట్

K Ramp review: కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ థియేటర్లను ఫుల్ చేసిందా.. ఎలా ఉందంటే?

K Ramp review: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘కె ర్యాంప్’ సినిమా థయేటర్లలో విడుదలైంది. ఇప్పటికే టీజర్ ట్రైలర్లతో ప్రేక్షకుల మనసు ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్లు ఫుల్ చేసిందా. కిరణ్ అబ్బవరం ఈ సినిమాపై పెట్టుకున్న ఆశలు నెరవేరాయా? కామెడీ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో కామెడీ పండిందా? దర్శకుడు జైన్స్ నాని మొదటి ప్రాజెక్ట్‌లో ఏం చేశాడు అనేది ఈ రివ్యూ చూసి తెలుసుకుందాం.

Read also-OG OTT Release: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న ఫైర్ స్ట్రోమ్.. ఎప్పుడంటే?

కథ

ఒక సంపన్న కుటుండంలో ఉన్న సాయికుమార్ కు కొడుకుగా పుడతాడు కిరణ్ అబ్బవరం. అల్లరి చిల్లరగా తిరుగుతూ చదువు, బాధ్యదలకు దూరంగా ఉంటాడు. ఇదంతా చూస్తున్న కిరణ్ తండ్రి కుర్రాడిని సెట్ చేయాలని కేరళలోని ఒక కాలేజీలో జాయిన్ చేయిస్తాడు. అక్కడ (కిరణ్ అబ్బవరం) కుమార్‌కు మెర్సీ (యుక్తి తరేజా) పరిచయమవుతుంది. హరోయిన్ ఒక అందమైన అమ్మాయ. కానీ మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటుంది. ఆమెతో ప్రేమలో పడిన కుమార్, ఆమె సమస్యలు (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ – PTSD) తెలుసుకుని ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాడు? తన చిల్లర లైఫ్ నుంచి బాధ్యతల వైపు మళ్లి, తండ్రి-కొడుకు బంధాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు? ఇది మెయిన్ ట్రాక్. కేరళ బ్యాక్‌డ్రాప్‌లో రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ మిక్స్ అయి సాగుతుంది. ఇంటర్వల్ లో ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ లో సినిమా మొత్తం పూర్తిగా మారిపోతుంది. ఎక్కువగా ఫన్, ఎమోషన్ మీదకు ఫోకస్ అవుతుంది.

నటీ నటులు

కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో కుమార్ అబ్బవరం కనిపిస్తాడు. వన్ మ్యాన్ షో లాగా కామెడీ నుంచి ఎమోషన్ వరకు అన్నీ పలికిస్తాడు. హీరోయిన్ యుక్తి తరేజా గ్లామర్ తోపాటు యాక్టింగ్ ను కూడా బ్యాలెన్స్ చేసింది. సమస్యతో బాధపడుతున్న యాంగిల్ బాగా చేసింది. కుమార్ తండ్రిగా సాయి కుమార్ ఎమోషనల్ రోల్‌లో ఆకట్టుకున్నాడు. నరేష్ బావమరిది కామెడీ ఎమోషన్ హైలైట్ గా నిలుస్తుంది. ఐస్ సాంబార్ జోకులు బాగా పేలాయి. వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్‌లో నవ్వులు పూయిస్తాడు. మురళీధర్ గౌడ్ సపోర్టింగ్ రోల్‌లో మెప్పించాడు. ఓవరాల్ గా ఎవరికి ఇచ్చిన పాత్రలకు వారు న్యాయం చేశారు.

సాంకేతిక అంశాలు

సినిమాటోగ్రఫీ పరంగా సతీష్ రెడ్డి కేరళ బ్యాక్‌డ్రాప్ బాగా చూపించారు. “సతీష్ రెడ్డి మసం కెమెరా వర్క్ నీట్, కలర్‌ఫుల్ ఫ్రేమ్స్ ఫెస్టివ్ వైబ్ తెచ్చాయి. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతానికి మిశ్రమ స్పందన వచ్చింది. “కలలే కలలే” సాంగ్ స్టాండౌట్, రొమాన్స్ ట్రాక్‌కు పర్ఫెక్ట్. మొత్తంగా సాంగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ లో చోటా కె. ప్రసాద్ తేలిపోయారు. ఈ సినిమాలో ఇక్కడే మెయిన్ వీక్‌నెస్ తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో స్లో పేసింగ్ ఉంటుంది. ఓవరాల్ గా ఎడిటింగ్ ఇంకాస్త మెరుగు పడాలి. హస్యా మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ ప్రొడక్షన్ “గుడ్” అని చెప్పాలి. ఈ సినిమాను మాస్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాలంటే టెక్నికల్స్ మరింత షార్ప్‌గా ఉండాలి.

Read also-Telugu movies: థియేటర్లలో వందల రోజులు ఆడే సినిమాలు ఇప్పుడెందుకు ఆడటంలేదు.. రిజన్ ఇదే..

బలాలు

కిరణ్ అబ్బవరం & యుక్తి తరేజ
సెకండాఫ్‌
వెన్నల కిషోర్

బలహీనతలు

ఫస్టాఫ్
ల్యాగ్ సీన్స్

రేటింగ్ – 2.25 /5

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..