Sundar Pichai: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు కాబోతుండడం, ఒక్క భారతదేశంలోనే కాదు, టెక్ ప్రపంచమంతటా చర్చనీయాంశంగా మారింది. అమెరికా వెలుపల గూగుల్‌కు ఇదే అతిపెద్ద ఏఐ హబ్ కావడం ఇందుకు కారణంగా ఉంది. దీంతో, విశాఖపట్నం పేరు మార్మోగిపోతోంది. అమెరికాలో సైతం ఈ పేరు వినిపిస్తోంది. ఎంతగా అంటే, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) నోట కూడా వైజాగ్ మాట వినిపించింది. కాలిఫోర్నియాలో ఇటీవల సేల్స్‌ఫోర్స్ డ్రీమ్‌ఫోర్స్ సదస్సులో పిచాయ్ మాట్లాడుతూ, వైజాగ్ పేరును ప్రస్తావించడం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
వైజాగ్‌తో తన వ్యక్తిగత అనుభవాన్ని పిచాయ్ పంచుకున్నారు. తాను దక్షిణ భారతదేశంలో రైలు ప్రయాణాలు చేసేటప్పుడు కోస్తా నగరమైన వైజాగ్‌ను చూశానని వెల్లడించారు. అందమైన ఈ నగరం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా వైజాగ్‌తో తన వ్యక్తిగత అనుబంధాన్ని, ఆ ప్రాంత అందాన్ని సుందర్ పిచాయ్ ప్రస్తావించారు. ఈ పెట్టుబడి పెట్టుబడి విశాఖపట్నం ప్రాంతాన్ని, నగర భవిష్యత్‌ను సంపూర్ణంగా మార్చివేయగలదంటూ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ హబ్ గురించి స్పందిస్తూ, అమెరికా వెలుపల గూగుల్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదేనని అన్నారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నామని, ఇదే విషయమై ఆదివారం రాత్రి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫోన్ చేసి మాట్లాడాడనని పిచాయ్ ప్రస్తావించారు.
వైజాగ్‌లో ఏర్పాటు చేయబోతున్న ఏఐ హబ్‌ను ఒక గిగావాట్ ప్లస్ డేటా సెంటర్‌గా ఏర్పాటు చేస్తున్నామని, దీనికోసం 80 శాతం క్లీన్ ఎనర్జీని ఉపయోగిస్తామని చెప్పారు. మొత్తంగా : సుందర్ పిచాయ్ వైజాగ్ ఏఐ హబ్‌ను కేవలం ఒక పెట్టుబడిగానే కాకుండా, సాంకేతికత ద్వారా భారతదేశంలో (ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో) అభివృద్ధికి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఒక బలమైన ఉత్ప్రేరకంగా నిలుస్తుందని అభివర్ణించారు. టెక్నాలజీపై మాట్లాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని , తద్వారా వచ్చే అద్భుతమైన మార్పును మనం చూడబోతున్నామని సుందర్ పిచాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీ ద్వారా మరో గొప్ప ముందడుగు వేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
షేర్ చేసిన మంత్రి నారా లోకేష్
సుందర్ పిచాయ్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఈ వీడియోను షేర్ చేశారు. ‘వైజాగ్ అందమైన నగరం. భారతదేశానికి ఏఐ హబ్‌గా నిలవబోతోంది’’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఏపీ అధికార కూటమికి చెందిన నాయకులు, మంత్రులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వం చూపిస్తున్న చిత్తశుద్ధిని, విజన్‌ను ఈ వీడియో తెలియజేస్తోందని అంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కృషితో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ వచ్చినట్లుగానే, నేడు వైజాగ్‌కు గూగుల్ వంటి టెక్ దిగ్గజం రావడం ఒక గొప్ప మైలురాయి అని వారు అభివర్ణిస్తున్నారు. విశాఖపట్నం పేరు అమెరికాలో కూడా మార్మోగడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
దేశంలోని పెద్దపెద్ద నగరాల్లో ఒక నగరమే సరైన సుస్థిరాభివృద్ది దిశలో పయనిస్తోందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నాడు. ఐటీకి సంబంధించి హైదరాబాద్, విశాఖపట్నం నగరాలు తెలుగు రాష్ట్రాలకు రెండు కళ్లు వంటివని పలువురు అభినందిస్తున్నారు. మరి, ఇంత అందమైన సిటీని రాజధానిగా ఎందుకు పరిగణించడం లేదంటూ మరికొందరు కామెంట్లు పెట్టడం గమనార్హం.
Read Also- OG OTT Release: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న ఫైర్ స్ట్రోమ్.. ఎప్పుడంటే?
#Vizag is beautiful.
Vizag will become the AI Hub Of India. #GoogleComesToAP #YoungestStateHighestInvestment @sundarpichai pic.twitter.com/wQNHBn2gFC— Lokesh Nara (@naralokesh) October 18, 2025
