Bigg Boss Telugu 9: ద కింగ్ ఈజ్ బ్యాక్.. శనివారం వచ్చేసింది. అంటే కింగ్ నాగార్జున (King Nagarjuna) వచ్చేస్తారు.. అందరితో ఓ ఆట ఆడుకుంటారు. ఫైనల్‌గా ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. బిగ్ బాస్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక లెక్క.. శని, ఆదివారాల్లో మరో లెక్క అన్నట్లుగా ఉంటుందనే విషయం తెలియంది కాదు. ఇక ఈ శనివారం (బిగ్ బాస్ హౌస్‌లో 41వ రోజు) నాగ్ ఎపిసోడ్‌కు సంబంధించి రెండు ప్రోమోస్ వచ్చేశాయి. ఈ ప్రోమోలలో ఒక్కొక్కరిని కింగ్ నాగ్ ఉతికి ఆరేస్తున్నారు. ఎప్పుడూ లేనిది, కింగ్ నోటి వెంట ‘పగిలిపోద్ది’ అనే మాట కూడా వచ్చిందంటే.. ఈ వీకెండ్ ఏరేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీక్ అంతా ఇంటి సభ్యులు చేసిన మిస్టేక్స్‌ని చూపిస్తూ.. వారికి ఇవ్వాల్సినవి ఇచ్చేసి, వారి దగ్గర నుంచి లాక్కోవాల్సినవి లాక్కోవడం చేస్తుంటారు కింగ్ నాగ్. ఈ వారం ఇంకాస్త డోస్ పెంచి మరీ, వీక్షకులకు నాగ్ ట్రీట్ ఇవ్వబోతున్నాడనేది ఈ ప్రోమోలను చూస్తుంటే తెలుస్తుంది. మరెందుకు ఆలస్యం.. ఈ ప్రోమోలలో ఉన్న మ్యాటర్ ఏంటో తెలుసుకుందామా..
Also Read- King Nagarjuna: 100వ చిత్రం.. కింగ్ నాగార్జున చేస్తుంది రైటా? రాంగా?
ది కింగ్ ఈజ్ బ్యాక్..
మొదటి ప్రోమోలో కింగ్ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ అనంతరం ‘ఇవ్వాలేంటి అంత హుషారుగా ఉన్నారు’ అని హౌస్ సభ్యులను పలకరించారు. గౌరవ్‌కు 5 క్రౌన్స్, 5 వైల్డ్ కార్డ్స్‌కు ఇచ్చేసేయ్ అని చెప్పగానే, గౌరవ్ ఆ పని చేశారు. ఒక్కొక్కరిని పిలుస్తాను. ఇద్దరు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ మాత్రమే వాళ్లు డిజర్వ్ లేదంటే అన్‌డిజర్వ్ అని మాట్లాడదామని వెంటనే ఆడియెన్స్‌కు ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చేశారు. ఇక ఒక్కో కంటెస్టెంట్‌ని పిలిచి, వారు చేసిన మిస్టేక్స్ చెబుతూ ఆడియెన్స్‌తో ఓటింగ్ వేయిస్తున్నారు. ముందుగా మాధురిని పిలిచి ‘షి డిజర్వ్ పవర్ ఆర్ నాట్ అనేది డిసైడ్ చేద్దాం’ అని సుమన్ శెట్టిని పిలిచారు. కళ్యాణ్, మాధురి మధ్య ఒక ఇష్యూ జరిగింది.. అందులో తప్పెవరిది? అని ప్రశ్నించారు. మాధురిదే తప్పని సుమన్ శెట్టి చెప్పారు. ఆ గొడవకు సంబంధించి వీడియో ప్లే చేసి.. మాట్లాడిన విషయంలో తప్పులేదు.. మాట్లాడిన తీరులో తప్పుందని నాగ్ అన్నారు. నా వాయిస్ అలా ఉంటుందని మాధురి అంటే, ఇప్పుడలా లేదు కదా.. మాట తీరే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుందని కింగ్ చెప్పారు. ఆడియెన్స్ 40 శాతం ఓటింగ్ ఇవ్వడంతో.. ఆ పవర్‌కు ఆమె అనర్హురాలయ్యారు. వెంటనే మాధురి షీల్డ్‌లో ఉన్న పవర్ స్టోన్‌ని తీసేశారు. ఆయేషా దగ్గర ఉన్నది పవర్ ఆఫ్ నామినేషన్.. రైటా? రాంగా? అంటే తనూజ ‘షి డిజర్వ్ ఇట్’ అని సమాధానమిచ్చింది. అందుకు వివరణ కూడా ఇచ్చింది. రీతూ కూడా ‘షి డిజర్వ్’ అని ముందు చెప్పి, తర్వాత కాదని చెప్పింది. ఇమ్ము, భరణి, దివ్య కూడా మిగతా కంటెస్టెంట్ల విషయంలో తమ వివరణ ఇస్తున్నారు. వారికి నాగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ ప్రోమోలో ఉన్న విషయమిదే.
Also Read- Tollywood Box Office: నాలుగు సినిమాలు రిలీజ్ అయితే.. బాక్సాఫీస్ వద్ద సందడేది? వీక్ ఓపెనింగ్స్!
ట్రూత్ బాంబ్స్
రెండో ప్రోమో విషయానికి వస్తే.. రమ్య, కళ్యాణ్‌లను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన నాగ్.. ‘రమ్యా.. క్రౌన్ పెట్టుకుంటే మనం రాణి కాము. మనల్ని ఆ క్రౌన్‌కి అర్హత ఉండేలా చేసేది మన మాట తీరు’ అని ఓ వీడియో చూపించారు. మాధురి, రమ్యల మధ్య నడుస్తున్న ఆ సంభాషణలో కళ్యాణ్, తనూజల గురించి మాటలు నడుస్తున్నాయి. కళ్యాణ్ అలా చేతులు వేస్తుంటే చాలా ఇరిటేటింగ్‌గా ఉంది. అదే నన్ను చేస్తే.. లాగిపెట్టి ఒక్కటి ఇచ్చేస్తాను అని రమ్య చెబుతుంది. ‘ఒక మనిషికి అమ్మాయిల పిచ్చి’ అనడానికి నువ్వు అతన్ని జీవితాంతం చూడలేదు. కళ్యాణ్ అమ్మాయిలతో బిహేవ్ చేసే తీరుపై ఆడియెన్స్ ఓటింగ్ జరపగా.. ఆల్మోస్ట్ ఫిఫ్టీ-ఫిఫ్టీ వచ్చింది. ఆ తర్వాత రీతూ, పవన్‌లను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి, మీ ఇద్దరి మధ్య నువ్వు ఏ జోన్‌లో ఉన్నావు అని రీతూని ప్రశ్నించారు. చాలా కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నానని రీతూ చెప్పగానే, నాగ్ ఓ వీడియో ప్లే చేయించారు. అందులో రమ్య, పవన్‌ల మధ్య సంభాషణ నడుస్తుంది. పవన్ తీరుపై బయట జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో అందులో రమ్య చెబుతుంది. అనంతరం పవన్ నువ్వు ఏ జోన్‌లో ఉన్నావని నాగ్ ప్రశ్నించగా, సేమ్.. రీతూ ఇచ్చిన సమాధానమే అతను కూడా చెప్పారు. పవన్ చెబుతున్న దానిలో ఉన్న విషయంపై ఆడియెన్స్ పోల్ నిర్వహించగా.. 100 శాతం థంబ్స్ డౌన్ వచ్చాయి. ఇంత యూనానిమస్ ఓటింగ్ ఇంత వరకు ఎప్పుడు జరగలేదు అంటూ నాగ్ ఓ కౌంటర్ ఇచ్చారు. మరో వీడియో చూపించి.. అందులో రెండూ చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుందని మాధురి చెబుతున్నదానిని హైలెట్ చేశారు. తనూజ షాకయింది. బ్రేక్ తర్వాత ఇమ్మానుయేల్‌కు పగిలిపోతుంది అని.. ఎప్పుడూ వాడని మాటను నాగ్ వాడారు. దీంతో ఈ ప్రోమో ఎండ్ అయింది. మొత్తంగా చూస్తే.. ఈ వీకెండ్ కంటెస్టెంట్స్ అందరికీ నాగ్ ఇచ్చిపడేసినట్లుగా ఈ ప్రోమోస్ క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
