Earth: భూగోళం పై 80% జీవులు నివాసముంటున్నాయి. భూమి ఉపరితలం నుంచి 2 అడుగుల దిగువన మట్టిలో బొరియలు చేసుకున్న జీవులు, పంది కొక్కులు ఉంటున్నాయి. అక్కడే మట్టిలో పెరిగే వివిధ రకాల కీటకాలు, వాన పాములు కూడా నివసిస్తున్నాయి. చీమలు కూడా ఉన్నాయి. ఇంకొంచం 10 అడుగులు లోతులోకి వెళ్తే అడవి ఎలుకలు కనిపిస్తాయి. మన ఇళ్ళ పునాదులు, గొట్టాలు కూడా 10 అడుగుల లోతులోనే ఉంటాయి. వాటర్ బోర్ల మోటార్లు, వాటికీ సంబంధించిన గొట్టాలు కూడా భూమి లోపలే ఉంటాయి.
భూగర్భంలో మనకీ తెలియకుండా అన్ని ఉన్నాయా?
భూ ఉపరితలం నుంచి 10 నుంచి 15 అడుగుల లోతులో నైల్ జాతి మొసళ్ళు జీవిస్తున్నాయి. 32 అడుగుల లోతులో వియాత్నం యుద్ధ సమయంలో సైనికులు ఏర్పాటు చేసుకున్న క్యూచి స్వరంగాలు ఉన్నాయి. 65 అడుగుల లోతులో 18 వ శతాబ్దం నాటి పారిస్ లోని కటాకంబ్స్ తాలూకా సమాధులు కనిపిస్తాయి. దానిలో 60 లక్షల కంటే ఎక్కువ సమాధులు ఉన్నాయి. 80 అడుగుల లోతులో లండన్ నగరం మెట్రో స్టేషన్ ఉంది. 164 అడుగుల లోతులో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేయబడింది.
Also Read: Health Tips: కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? అయితే, ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి
197 అడుగుల లోతులో భూగర్భ ఈత కొలను ఉంది. డీప్ డైవ్ గా పిలిచే ఈ స్విమ్మింగ్ ఫూల్ దుబాయ్ లో ఉంది. మరింత లోతుగా వెళ్తే.. 217 అడుగుల లోతులో మెస్కయిట్ చెట్టు వేర్లు కనిపిస్తాయి. నీళ్ళను వెతుక్కుంటూ ఆ వేర్లు అంత లోతు వరకు వెళ్ళాయి. భూమిలోని వృక్ష జాతుల్లో అడవి ఫిగ్ చెట్ల వేర్లు 300 అడుగుల లోతు వరకు విస్తరించి ఉన్నాయి. 500 అడుగుల లోతులో సాలా సిల్వర్ హోటల్ ఉంది. అక్కడ 2 నుంచి 3 సెల్సియస్ ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. విద్యుత్ సౌకర్యం, ఇంటర్నెట్ ఏం లేకుండా కొవ్వొత్తుల వెలుగులోనే వైవిద్యమైన అనుభూతి కలిగించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
