DGP Shivdhar Reddy (imagecredit:swetcha)
తెలంగాణ

DGP Shivdhar Reddy: తెలంగాణ బందును శాంతియుతంగా జరపాలని డీజీపీ ఆదేశం

DGP Shivdhar Reddy: ఈనెల 18న తలపెట్టిన బందును శాంతియుతంగా జరుపుకోవాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీజీపి హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ ఐక్య కార్యాచరణ సమితి బందుకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి వేర్వేరు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గమ మద్దతు ప్రకటించాయి. అయితే, దీంతో సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందును జరుపుకోవాలని డీజీపీ శివదర్ రెడ్డి తెలిపారు. పోలీసులు, నిఘా వర్గాలు ప్రతీ దానిపై కన్నేసి పెడతారని ఆయన తెలిపారు. బందులో సమస్యలు ఎవరు సృష్టించినా వారిపై కటిన చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు.

Also Read: TUWJ: జర్నలిస్టుల హెల్త్ కార్డుల కోసం కృషి చేస్తాం.. టీయూడబ్ల్యూజే సభ్యుల కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్..

తెలంగాణలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయం హట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్​ అమలు చేస్తామనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే ప్రభుత్వం జీవో 9 విడుదల చేస్తూ 23శాతం రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో హైకోర్టు తీర్పను సవాల్ చుస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పిటీషన్ వేసింది. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం దాకలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో పాత రిజర్వేషన్ల ప్రకారమే స్ధానికి ఎన్నికలు జరపాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.

Also Read: RV Karnan: జూబ్లీ హిల్స్ పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతులు కల్పించాలి.. జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక అదేశాలు

Just In

01

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..

BRS Party: జూబ్లీహిల్స్ ప్రచార సరళిపై గులాబీ నిత్యం ఆరా.. సొంత నేతలపై నిఘా!