Health Tips: మన పెద్దలు ఎప్పుడూ చెప్పే మాట “కోపం కొంపలు ముంచుతుంది.” పురాణాల్లోనూ కోపం వల్ల జరిగిన అనర్థాల కథలు బోలెడున్నాయి. కోపం సహజ భావోద్వేగమే, కానీ అది ఎప్పుడూ మంచిది కాదు. కోపంతో మాట్లాడితే, సంబంధాలు తెగిపోతాయి. చిన్న విషయానికి కూడా తొందరగా కోప్పడితే, నీ చుట్టూ ఉన్నవాళ్లు నీతో మాట్లాడేందుకు భయపడి పారిపోతారు. ఈ బిజీ లైఫ్‌లో చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని, అనవసరంగా మాట్లాడి, మనసు నొప్పించుకుంటున్నవాళ్లు ఎక్కువమంది ఉన్నారు. అయితే, ఈ కోపాన్ని అదుపులో ఉంచడం ఎలా? ఈ టిప్స్ ఫాలో అయితే, కోపం కంట్రోల్ అవ్వడమే కాకుండా, మనసు కూడా ప్రశాంతంగా మారిపోతుంది!
1. 10 సెకన్లు ఆగు, ఆలోచించు!
కోపం ముంచుకొస్తున్నప్పుడు నోటికొచ్చిన మాటలు అనేయకండి. జస్ట్ 10 సెకన్లు ఆగండి. ఆ క్షణంలో నీవు ఏం చెప్పబోతున్నావో, దాని పరిణామాలు ఏంటో ఒక్కసారి ఆలోచించు. ఈ చిన్న విరామం మీ మెదడు ఆలోచించేలా చేస్తుంది. భావోద్వేగాల నుంచి బయటపడటానికి హెల్ప్ అవుతుంది. “10 సెకన్ల మౌనం గా ఉంటే మీకు ఎంతో ప్రశాంతత దొరుకుతుంది . ” అంత పవర్‌ఫుల్ ఈ టెక్నిక్.
2. ప్లేస్ మారితే మూడ్ కూడా మారుతుంది!
గొడవ హీటెక్కుతోందా? వెంటనే ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోండి. ఒక్క అడుగు బయటకు వేసి, వేరే రూమ్‌కి వెళ్లిపో. సైన్స్ ఏం చెబుతుందంటే, నీ చుట్టూ ఉన్న వాతావరణం మారితే, మీ ఆలోచనలు, ఫీలింగ్స్ కూడా మారతాయి. ఇది మీ కోపానికి కారణమైన పరిస్థితిని నార్మల్ గా చేస్తుంది.
దీని వలన మీరు కూల్‌గా ఆలోచించగలుగుతారు.
3. చల్లని నీళ్లు తాగు, కోపం చల్లారిపోతుంది!
కోపం వచ్చినప్పుడు ఒక గ్లాస్ చల్లని నీళ్లు తాగేయండి. ఇది సింపుల్ టిప్, కానీ బాగా వర్క్ చేస్తుంది. చల్లని నీళ్లు తాగితే మీ గొంతు చల్లబడుతుంది, గొంతు చల్లబడితే మనసు కూడా కూల్ గా ఉంటుంది. ఇది నీ శరీరాన్ని, మైండ్‌ని రిలాక్స్ చేస్తుంది. కోపం అనే అగ్ని ఈ చల్లదనంతో ఆరిపోతుంది. ఇంట్లో చల్లని నీళ్లను తాగి కూల్ అవ్వండి.
4. డీప్ బ్రీత్ తీసుకో, కోపం దూరమవుతుంది!
కోపం వచ్చినప్పుడు మీ శ్వాసను కంట్రోల్ చేయడం ఒక అద్భుతమైన టెక్నిక్. మీరు గట్టిగా శ్వాస తీసుకోండి , ఆ తర్వాత నెమ్మదిగా వదులండి. ఈ డీప్ బ్రీతింగ్ హార్ట్‌రేట్‌ని తగ్గిస్తుంది, మీ మెదడుకి ఆక్సిజన్ సప్లై చేస్తుంది. మీ కోపం కంట్రోల్‌లోకి వస్తుంది. ఈ టెక్నిక్‌ని 2-3 సార్లు చేస్తే, రిలాక్స్ అయిపోతారు.
