dude-review( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Dude movie review: ప్రదీప్ రంగనాధన్ ‘డ్యూడ్’ ప్రేమ కథ ఫలించిందా?.. తెలియాలంటే?

వివరాలు

Dude movie review: ప్రదీప్ రంగనాధన్ హీరోగా నటించిన ‘డ్యూడ్'(Dude) అక్టోబర్ 17,2025న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు కీర్తిశ్వరన్ మొదటి చిత్రంగా ఈ మూవీని తీసుకొచ్చారు. ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు. రోహిణి , హృదూ హరూన్, సత్య, నేహా శెట్టి తదితరులు నటిస్తారు. సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా సినిమా దీపావళి సందర్భంగా విడుదలైంది.

Read also-Kantara 1 collection: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’.. రెండు వారాల కలెక్షన్స్ ఎంతంటే?

కథ

కుందన్ (మమితా బైజు) పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) కుమార్తె. ఆమె మేనత్త కుమారుడు గగన్ (ప్రదీప్ రంగనాథన్)ను ప్రేమిస్తుంది. కానీ గగన్ ఆ ప్రేమను ఓప్పుకోడు. లవ్ ఫెయిల్యూర్ బాధలో బెంగళూరుకు వెళ్లిపోతుంది కుందన్. ఎప్పుడూ పక్కన ఉండే అమ్మాయి దూరం అయ్యేసరికి గగన్ మనసులో ప్రేమ బయటపడుతుంది. తన మావయ్యకు చెప్పి పెళ్లి చేసుకుంటానని బతిమాలతాడు . గగన్ తల్లి (రోహిణి) కుందన్ తండ్రి మధ్య ఉన్న పాత గొడవలు, పెళ్లి మధ్యలో వచ్చే అడ్డంకులు, కుందన్ ఆకస్మికంగా పెళ్లి వద్దని అనడం, గగన్ చేసే త్యాగాలు ఇవన్నీ సినిమాను ముందుకు తీసుకెళతాయి. మొత్తంగా.. బాల్యం నుంచి పెరిగిన వ్యక్తిపై ప్రేమ, కుటుంబ బంధాలు, సామాజిక సమస్యలపై కొంచెం సందేశం ఇచ్చే కథ. దీని గురించి మరింత తెలుసుకోవాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.

నటీనటుల ప్రదర్శన

సినిమా మొత్తాన్ని ప్రదీప్ రంగనాథన్ అన్న తానై నడిపించాడు. ఎమోషనల్ సీన్స్‌ అద్భుతంగా పండాయి. హీరోయిన్ గా మమితా బైజు ‘ప్రేమలు’ ఫేమ్ తర్వాత తెలుగులో మరో మంచి పాత్ర వచ్చింది. సహజ నటన, ప్రేమ-బాధలు బాగా కనిపిస్తాయి. ప్రదీప్‌తో కెమిస్ట్రీ నేచురల్ గా అనిపిస్తుంది. శరత్ కుమార్ సీరియస్ మంత్రి పాత్రలో హాస్యం, భావోద్వేగాలు మిక్స్ చేసి మెప్పించాడు. నేహా శెట్టి, రోహిణి, హృదూ హరూన్, సత్య తక్కువ స్క్రీన్ టైమ్‌లోనూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

Read also-Telusu Kada movie review: సిద్దు జొన్నలగడ్డ ఇద్దరు హీరోయిన్లతో చేసిన రొమాన్స్ కనెక్ట్ అయ్యిందా?.. ‘తెలుసుకదా’ రివ్యూ

సాంకేతిక అంశాలు

టెక్నికల్ అంశాలు ఎలా ఉన్నాయంటే.. కథ, దర్శకత్వం గురించి మాట్లాడితే, ప్రేమకథల్లో కొత్తదనం కష్టమే అయినా చెప్పే తీరు మాత్రం చాలా ముఖ్యం. ప్రేమ వ్యక్తీకరణ సమయంలో మార్పులు, సామాజిక సమస్యలు ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. ముగింపు అందరూ అమోదించేలా ముగించారు. కెమేరా పనితనం ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ విసయానికొస్తే కాస్త మెరుగు పడాల్సి ఉంది. సాయి అభ్యంకర్ అందించి సంగీతం మెప్పించింది. సంగీతం సినిమాలు బాగా ఎలివేట్ చేస్తుంది.

ప్లస్ పాయింట్స్

  • ప్రదీప్ రంగనాధన్ నటన
  • కామెడీ, ఎమోషనల్ సీన్స్ బ్యాలెన్స్
  • సంగీతం

మైనస్ పాయింట్స్

  • హీరోయిన్ పాత్ర డెవలప్‌ కాకపోవడం
  • స్క్రీన్‌ప్లే కొన్ని చోట్ల నెమ్మదిగా ఉండటం.

రేటింగ్ – 2.5 / 5

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!