Kantara 1 collection: రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఏకంగా రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.717.5 కోట్ల గ్రాస్ వసూళ్లు (Kantara 1 collection) సాధించింది. 2025లో విడుదలైన అత్యంత లాభదాయక చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అక్టోబర్ 2, 2025న దసరా సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 2022లో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మొదటి ‘కాంతారా’కు ప్రీక్వెల్‌గా ఈ సినిమా విడుదలైంది. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు నిర్మించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య, సప్తపది శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, మహేంద్ర్ భాట్ కెమెరా వర్క్ అందరినీ మెప్పించింది. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడానికి దోహద పడ్డాయి.
18వ శతాబ్దంలో భూమి దేవతకు భక్తి చేసే గ్రామస్థులు, అరణ్య రక్షకుడు శువర్ణలేఖ తుంగ మధ్య ఘర్షణల చుట్టూ తిరుగుతుంది. మొదటి భాగంలో శివా జన్మకథ మూలాలు విప్పుతూ, యక్షగానం, భక్తి ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సినిమా ‘కాదుబెట్టు కార్తీకేశ్వర’ ఆరంభాలు, ‘పంజూర్లి దైవ’ (Panjurli Daiva) అనే దైవిక ఆయుధం మూలాలను తెలిపేలా రూపొందించబడింది. 300 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనల చుట్టూ తిరిగే ఈ కథలో, అడవుల మధ్య రాజులు, దేవతలు, మానవుల మధ్య ఘర్షణలు, దైవిక శక్తులు ప్రధానంగా ఉన్నాయి. మునిగి పుచ్చిన అడవి రహస్యాలు, సాంప్రదాయక యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డ్రామా మిశ్రమంగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పడు కలెక్షన్లలో దూసుకుపోతూ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వెయ్యి కోట్లు రూపాయలు వసూలు చేస్తుందని కాంతార అభిమానులు నమ్ముతున్నారు. అదే అయితే కన్నడ నుంచి వెయ్యి కోట్లు సాధించిన రెండో సినిమాగా నిలుస్తుంది.
Read also-Movie rating system: సినిమాకు రేటింగ్ ఏ ప్రాతిపదికన ఇస్తారు.. ఫుల్ రేటింగ్ వచ్చిన సినిమా ఏమైనా ఉందా?
ఈ చిత్రంలో రిషబ్ షెట్టి, రుక్మిణి వాసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ నటించారు. ఒరిజినల్ కథకు వెయ్యి సంవత్సరాల ముందు సెట్ చేయబడినది. ఇది కాంతార ప్రజల స్వయం పాలన కోసం పోరాడుతున్న ట్రైబల్ మనిషి బెర్మే (రిషబ్) కథ. ప్రిన్స్ కులశేకర (గుల్షన్) భూమి దాని ప్రజలను నియంత్రించాలని కోరుకుంటాడు, దీంతో బెర్మే అతని వ్యతిరేకంగా లేచి పోరాడుతాడు. అయితే ఈ సినిమా వెయ్య కోట్లు మార్కును అధిగమిస్తుందని కన్నడ ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ‘కేజీఎఫ్ 2’ కన్నడ ఇండస్ట్రీ నుంచి వెయ్యి కోట్లు వసూలు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ సినిమా కూడా అదే ఊపు కనబరుస్తుంది. కాంతార చాప్టర్ 1 సినిమా కూడా వెయ్యి కోట్లు మార్కును అధిగమించాలని కన్నడ ప్రజలు కోరుకుంటున్నారు. కన్నడ చిత్రాల్లో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
A divine storm at the box office 💥💥#KantaraChapter1 roars past 717.50 CRORES+ GBOC worldwide in 2 weeks.
Celebrate Deepavali with #BlockbusterKantara running successfully in cinemas near you! ❤️🔥#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere#Kantara… pic.twitter.com/rd92Dch1mS
— Hombale Films (@hombalefilms) October 17, 2025
