telusu-kada( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Telusu Kada movie review: సిద్దు జొన్నలగడ్డ ఇద్దరు హీరోయిన్లతో చేసిన రొమాన్స్ కనెక్ట్ అయ్యిందా?.. ‘తెలుసుకదా’ రివ్యూ

సినిమా వివరాలు

Telusu Kada movie review: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నీరజ కోన దర్శకత్వం వహించిన ‘తెలుసు కదా’ చిత్రం 2025 అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. వైవా హర్ష, రవి మరియా వంటి తారాగణం కీలక పాత్రలు పోషించారు. విఎస్ జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, తమన్ మ్యూజిక్ డైరెక్షన్‌తో ఈ రొమాంటిక్ ఎమోషనల్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రూపొందింది. యూత్ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆధునిక ప్రేమ సంబంధాలు, భావోద్వేగాలు, హాస్యాన్ని మిక్స్ చేసి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Read also-Movie rating system: సినిమాకు రేటింగ్ ఏ ప్రాతిపదికన ఇస్తారు.. ఫుల్ రేటింగ్ వచ్చిన సినిమా ఏమైనా ఉందా?

కథాంశం

‘తెలుసు కదా’ సినిమా మొత్తం వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ) జీవితంలో జరిగే ప్రేమ కథల చుట్టి తిరుగుతుంది. ఇద్దరు అందమైన అమ్మాయిలు (రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి) మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో చూపించారు. వరుణ్( సిద్దు జొన్నలగడ్డ) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాధ అనే ఫీలింగ్ లో బ్రతుకుతాడు. అందువల్ల తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలని కలలు కంటాడు. అందుకోసం కష్టపడి చదివి పెద్ద బిజినెస్మెన్ అవుతాడు. తర్వాత అంజలి( రాశీ కన్నా) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆమెకు పిల్లలు పుట్టరు అని తెలుస్తుంది. దీంతో సరిగసి పద్ధతిని ఆశ్రయిస్తారు ఆ దంపతులు. ఈ క్రమంలో రాగ (శ్రీనిధి శెట్టి)ని అంజలి ఎంపిక చేసుకుంటుంది. ఆమె కూడా అందుకు రెడీ అవుతుంది. అయితే రాగ .. వరుణ్ ఎక్స్ లవర్ అనేది ఇక్కడ ట్విస్ట్. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు వరుణ్ .. రాగ ఎందుకు బ్రేకప్ అయ్యారు. ఆమె మళ్ళీ వరుణ్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ..అతని లైఫ్ లో వచ్చిన సమస్యలు ఏంటి? తర్వాత అంజలి వరుణ్ కలిసున్నారా? విడిపోయారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు..

నటీనటులు విషయానికి వస్తే .. సిద్దు జొన్నలగడ్డ బాగానే చేశాడు కానీ ఎక్కువ శాతం అతను ఎవరినో ఇమిటేట్ చేసినట్టు అనిపిస్తుంది. రాశీ ఖన్నా లుక్స్ బాగున్నాయి. పెర్ఫార్మన్స్ పరంగా శ్రీనిధి శెట్టి బెటర్ అనిపించింది. వైవా హర్ష కామెడీ సినిమాకు పెద్ద రిలీఫ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ లో అన్నపూర్ణ కూడా నవ్వించే ప్రయత్నం చేసింది. కొందరు ఆర్టిస్టులను సరిగ్గా ఉపయేగించలేదు అనిపిస్తుంది.

టెక్నికల్ అంశాలు..

స్క్రీన్ ప్లే విషయానికొస్తే.. ఆడియన్స్ కి ఇది ఒక డైలీ సీరియల్ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంత పర్వాలేదు అనిపించినా తర్వాత తేలిపోయింది సినిమా మొత్తం. నిర్మాతలు ఈ సినిమాకి పెద్దగా ఖర్చు పెట్టింది కూడా ఏమీ లేదనిపిస్తుంది. ఇక తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు కానీ.. గుంటూరు కారం, ఓజీ సినిమాల్లో ట్యూన్ లు అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది.

Read also-Ellamma movie: ‘ఎల్లమ్మ’ సినిమాలో హీరో నితిన్ కాదా?.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ప్లస్ పాయింట్స్

  • ఫస్ట్ హాఫ్
  • వైవా హర్ష చేసిన కామెడీ

మైనస్ పాయింట్స్

  • సెకండాఫ్
  • క్లైమాక్స్ హడావిడిగా తేల్చేశారు
  • శ్రీనిధి శెట్టి, సిద్దుల లవ్ ట్రాక్

రేటింగ్- 2 /5

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!