BC Reservations: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ (BC Reservations) బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చిపార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18వ తేదీన బీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బందుకు జిల్లా వ్యాప్తంగా వాణిజ్య వ్యాపార సంస్థలు విద్యాసంస్థలు హోటల్లు సహకరించాలని పలు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. బంద్ విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు స్థానిక మహావీర్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ జన సమితి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. రాజకీయ విద్య ఉద్యోగ అవకాశాలలో వెనుకబడిన తరగతుల వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బిల్లును పార్లమెంట్లో వెంటనే చట్టం చేయాలని వారు ముక్తకంఠంతో కోరారు.
Also Read: BC Reservations: బీసీ రిజర్వేషన్లపై సర్కార్ సవాల్.. సుప్రీం విచారణపై ఉత్కంఠ?
ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు గట్ల రమాశంకర్ అధ్యక్షత వహించగా తెలంగాణజనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్,. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మందాడి డేవిడ్ కుమార్సం బీసీ క్షేమ సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసంత సత్నారాయణ పిళ్ళై, మాదిగ ఉద్యోగ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతలపాటి శ్రీరాములు, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంతుల మదు, సిపిఐ యం జిల్లా నాయకులు మట్టిపల్లి సైదులు, సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకన్న,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజయ్య , బి సి సమితి అధ్యక్షుడు చలమల నరసింహ బి సి సంఘం జిల్లా అధ్యక్షులు పొంగోటి రంగ,జనసేవ సమితి అధ్యక్షుడు జనార్ధన్, యాదగిరిరావ్, సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ భద్రయ్యా,నార బోయిన కిరణ్, వెంకట్ యాదవ్,బాశపంగుసునీల్,, బచ్చలికూరీ గోపి,వెనురాజ్, నిద్ర సంపత్,బొమ్మగాని వినయగౌడ్, పుల్లూరి సింహాద్రి ,భరత్ దండి ప్రవీణ్,రాజు,కుంచం వెంకట్, తదితరులుపాల్గొన్నారు.
Also Read: BC Reservations: బీసీలకు రిజర్వేషన్ల కేటాయించడం హర్షనీయం
