Anshu: కింగ్ నాగార్జున (King Nagarjuna) సరసన ‘మన్మథుడు’ (Manmadhudu) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి అన్షు అంబానీ (అన్షు), తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న ఒక పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది. కేవలం ఒక శారీని పైన కప్పుకుని, జాకెట్ లెస్‌గా చేసిన బోల్డ్ ఫొటోషూట్‌కి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ వీడియోతో పాటు, ‘‘నా కంఫర్ట్ జోన్ నుండి బయటకొచ్చాను, ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచనను పక్కన పెట్టాను. నేను పరిణితి చెందిన మహిళనని అంగీకరిస్తున్నాను. నేను బలంగా, సున్నితంగా, పరిపూర్ణంగా ఉన్నాను. శక్తికి, శృంగారానికి మధ్యలో ఒక మహిళ తనను తాను పునరుద్ధరించుకుంటోంది’’ అంటూ ఒక శక్తివంతమైన మెసేజ్‌ని షేర్ చేసింది. (Anshu Latest Photoshoot Video)
విమర్శల వెల్లువ
అన్షు (Anshu) చేసిన ఈ పోస్ట్, జాకెట్ లెస్ ఫొటోషూట్ వీడియో పట్ల నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆమె ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటుండగా, మెజారిటీ నెటిజన్లు మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ‘మంచి నటిగా రీ-ఎంట్రీ ఇచ్చి, ఇటువంటి గ్లామర్ ట్రీట్‌మెంట్ అవసరమా?’ అనేలా ప్రశ్నిస్తున్నారు. ‘ఇంత మంచి నటి, ఈ వయసులో ఈ తరహా బోల్డ్ షూట్స్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆమెకు తగ్గట్టుగా మంచి పాత్రలు చేసుకోకుండా, పబ్లిసిటీ కోసం ఈ జాకెట్ లెస్ ట్రెండ్‌ను ఎందుకు ఎంచుకోవాలి?’ అంటూ కొందరు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. అన్షు ఇటీవల విడుదలైన ‘మజాకా’ అనే చిత్రంతో నటిగా రీ-ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో, తన టాలెంట్‌ను నిరూపించుకోకుండా ఇలాంటి ఫొటోషూట్‌ల ద్వారా దృష్టిని ఆకర్షించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముద్దుల ఎమోజీలతో ఎంకరేజ్
ఇదిలా ఉంటే, ఇది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ, ఎటువంటి దుస్తులు ధరించాలనేది ఆమె ఇష్టం’ అంటూ మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి, ‘మన్మథుడు’ హీరోయిన్ జాకెట్ లెస్ ట్రీట్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోలో గ్రీన్ కలర్ శారీని పైన కప్పుకుని, జాకెట్ లెస్‌గా చాలా ధైర్యంగా ఆమె ఈ ఫొటోషూట్‌లో పాల్గొంది. విమర్శల సంగతి పక్కన పెడితే.. ఈ షూట్‌లో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. చాలా మంది నెటిజన్లు ముద్దుల ఎమోజీలతో ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. కొన్నింటికి ఆమె రిప్లయ్ కూడా ఇస్తున్నారు. మొత్తంగా అయితే మరోసారి అన్షు వార్తలలో హైలెట్ అవుతోంది. మరి, ఈ ట్రీట్ ఆమెకు ఎలాంటి అవకాశాలు తెచ్చిపెడుతుందో చూడాలి. ఈ వీడియో చూస్తుంటే.. ఇది ఆమె ఓ బొటిక్ కోసం చేసిన ఫొటోషూట్ అని తెలుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
