Meesala Pilla Song: సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘గోదారి గట్టు మీద రామచిలకవే’ సాంగ్ ఎలాంటి సెన్సేషన్‌ని క్రియేట్ చేసిందో.. తాజాగా వచ్చిన చిరు, అనిల్ రావిపూడి కాంబో మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) నుంచి వచ్చిన ‘మీసాల పిల్ల’ (Meesala Pilla Song) కూడా మ్యూజిక్ వరల్డ్‌ని షేక్ చేస్తూ.. టాప్‌లో ట్రెండ్ అవుతోంది. వాస్తవానికి ఈ పాట ప్రోమోనే ఓ ఊపు ఊపింది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్ట్రాటజీతో, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గ్రేస్ మూమెంట్స్ వచ్చిన ఈ పాట.. ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన సినిమాల పాటల రెస్పాన్స్‌ను బీట్ చేసి సరికొత్త రికార్డ్ దిశగా దూసుకెళుతోంది. ప్రస్తుతం ఈ ‘మీసాల పిల్ల’ దేశవ్యాప్తంగా టాప్‌లో ట్రెండ్ అవుతూ 17 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించి మ్యూజిక్ వరల్డ్‌ని షేక్ చేస్తున్నట్లుగా మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు.
Also Read- Gujarat Politics: ఒక్క సీఎం మినహా.. మూకుమ్మడిగా రాజీనామా చేసిన గుజరాత్ మంత్రులు!.. ఎందుకో తెలుసా?
48 గంటల్లో 17 మిలియన్ ప్లస్ వ్యూస్
మెగాస్టార్ చిరంజీవి మాస్ అండ్ క్లాస్ కాంబినేషన్‌ని ప్రజెంట్ చేసిన ఈ పాట రికార్డుల వర్షం కురిపిస్తూ దూసుకెళుతోంది. చిరంజీవి-వశిష్ఠ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ‘విశ్వంభర’ మూవీలోని రామరామ సాంగ్‌కు 24 గంటల్లో పది మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ‘వాల్తేరు వీరయ్య’ మూవీలోని ‘బాస్ వేర్ ఈజ్ ద పార్టీ’ 9.5 మిలియన్లు, పూనకాలు లోడింగ్ 7.6 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నాయి. వీటితో పోలిస్తే ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి వచ్చిన ‘మీసాల పిల్ల’ సాంగ్ 24 గంటల వ్యూస్ రిపోర్ట్ లేదు కానీ 48 గంటల్లో 17 మిలియన్ ప్లస్ వ్యూస్ రాబట్టి.. ఇంకా మ్యూజిక్ వరల్డ్‌లో టాప్‌లో దూసుకెళుతోంది. హిట్ మెషీన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మ్యూజికల్ ఫీస్ట్‌లో.. మెగాస్టార్ చిరంజీవి తన ఎనర్జీ, మ్యాజికల్ డ్యాన్స్ మూవ్స్, గ్రేస్‌తో అదరగొట్టారు. నయనతారతో ఆయన కెమిస్ట్రీ స్క్రీన్‌పై చూడముచ్చటగా వుందంటూ ఈ పాటకు నెటిజన్లు కామెంట్స్ వేసుకుంటున్నారు.
Also Read- Tilak Varma: ‘మన శంకరవర ప్రసాద్ గారు’ సెట్‌లో ఆసియా కప్ హీరోకు అపూర్వ గౌరవం.. ఫొటోలు వైరల్
పాన్ ఇండియా క్రేజ్‌కు నిదర్శనం
భీమ్స్ సీసిరోలియో స్వరపరిచిన ఈ పాట విషయానికి వస్తే.. ఇందులో ఎలక్ట్రానిక్ బీట్స్, సింథ్ సౌండ్స్, ట్రెడిషనల్ పెర్కషన్ మేళవింపును ఆయన సెట్ చేశారు. అలాగే భాస్కరభట్ల సాహిత్యంలోని చిలిపితనం, సరదా, ఫన్‌తో ఆకట్టుకునేలా ఉంటే, ఐకానిక్ సింగర్స్ ఉదిత్ నారాయణ్ వాయిస్‌లోని నాస్టాల్జిక్ టచ్, శ్వేతా మోహన్ వాయిస్‌లోని ఎలిగెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాట రిలీజైన రెండురోజుల్లోనే ‘మీసాల పిల్ల’ 17 మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించి దేశవ్యాప్తంగా టాప్ 1లో ట్రెండ్ అవుతుండటంతో.. ఇది చిరంజీవి పాన్-ఇండియా క్రేజ్‌కి నిదర్శనం అంటూ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ‘మీసాల పిల్ల’ ఇచ్చిన సూపర్ స్టార్ట్ అదిరిందని, మరిన్ని మెగా చార్ట్‌బస్టర్స్ కోసం ఎదురుచూస్తున్నామని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాబోయే సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
